Site icon NTV Telugu

Minister Seethakka: మిషన్ భగీరథ, స్త్రీ శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష..

Seethakka

Seethakka

హైదరాబాద్‌లో మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖపై మంత్రి అనసూయ సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలపై తీసుకుంటున్న విషయాలను గురించి ఆరా తీసిన మంత్రి.. నివారణ చర్యలు కూడా తీసుకోవాలని మిషన్ భగీరథ శాఖలోని చీఫ్ ఇంజనీర్లు సూపరింటెండింగ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని, రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి రోజు వారీ నీటి సరఫరా జరిగేలా చూడాలని ఆమె ఇంజనీర్లను చెప్పారు.

Read Also: Amrapali Kata: హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఆమ్రపాలి బాధ్యతల స్వీకరణ

ఇక, రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు, నదుల తదితర తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సీతక్క సూచించారు. రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గినప్పుడల్లా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. మిషన్ భగీరథ ప్రాముఖ్యతపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో అవగాహన ప్రచారానికి ఏర్పాట్లు చేయాలని సీఈలు, ఎస్‌ఈలకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఇక, మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాల గురించి పూర్తిస్థాయిలో ముఖ్య కార్యదర్శి స్మిత సభర్వాల్ మంత్రి సీతక్కి వివరించారు. అలాగే, మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని మంత్రి తెలిపారు. త్వరలో మేడారం జాతరపై లైన్ డిపార్ట్‌మెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని సీతక్క వెల్లడించారు.

Exit mobile version