Site icon NTV Telugu

Minister Seethakka : ప్రతిపక్ష ప్రభుత్వాలున్న చోట బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుంది

Minister Seethakka

Minister Seethakka

ఈడీ రైడ్స్ పై మంత్రి సీతక్క స్పందించారు. సహాచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై జరిగిన ఈడీ దాడులను మంత్రి సీతక్క ఖండించారు. ప్రతిపక్ష ప్రభుత్వాలున్న చోట బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని ఆమె ఆరోపించారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను లొంగదీసుకునేందుకు ఈడీని వినియోగిస్తుంది బీజేపీ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను కులగొట్టడన్నే మొదటి నుంచి బీజేపీ పనిగా పెట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. గట్టిగా మాట్లాడిన ప్రతిపక్ష ఎంపీల ఇల్ల మీదకు ఈడీని పంపిస్తామని పార్లమెంట్ సాక్షిగానే బిజెపి ఎంపీలు మాట్లాడారని, ఈడి, సీబీఐ లను లను పచ్చిగా బిజెపి దుర్వినియోగిస్తుందని ఆయన పేర్కొన్నారు.

  Ujjain Mahakal Temple: కూలిన ఉజ్జయిని మహాకాల్ ఆలయ గోడ.. శిథిలాల కింద పలువురు..!

తమకు అనుకూలంగా రాజ్యాంగ విరుద్ధంగా దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని, అందులో భాగంగా మా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం పై ఈడి దాడి జరిగిందన్నారు మంత్రి సీతక్క. బలంగా పనిచేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలను బలంగా ప్రజలకు తీసుకెళుతున్న అన్న కారణంతోనే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈ డీ దాడి చేసిందని, పొంగులేటి నివాసంపై ఈడి దాడిని ఖండిస్తున్నామన్నారు. రాజకీయం ఎదుర్కోవాలి తప్ప ఆర్థికంగా దెబ్బతీసే కార్యక్రమాలు మానుకోవాలని, ప్రతిపక్ష నేతల నైతిక ధైర్యాన్ని దెబ్బతీసే కుట్రలను మోడీ, అమిత్ షా, అదానీలు, అంబానీలు మానుకోవాలన్నారు మంత్రి సీతక్క.

IPS Story: రూ.50 లక్షల ఫారిన్ ఉద్యోగం వదిలేసి.. ఎస్పీగా మారిన సంతోష్ కథ..

Exit mobile version