NTV Telugu Site icon

Minister Seethakka : ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాలు ధ్వంసం..

Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka : ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాలు ధ్వంసం ఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్న కొండాయి గ్రామంలో, నేడు అబ్బాయిగూడెంలో మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాలు ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. వరుస ఘటనలతో అధికార పార్టీ లో అయోమయం నెలకొంది. 10 నెలలు గడుస్తున్నా బ్రిడ్జి పనులు మొదలు కాలేదని, ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగుపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క నూతన బ్రిడ్జి కోసం ఆవిష్కరించిన శిలాఫలకం ధ్వంసం చేయగా.. మంగపేట మండలం అబ్బయిగుడెం గ్రామంలో వేసిన రహదారి నిర్మాణం కోసం వేసిన శిలాఫలకం ధ్వంసం కావడం మరొక్క సారి చర్చగా మారింది. సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాలు వరుసగా ధ్వంసం కావడం తో చర్చనీయాంశంగా మారిందన్నారు.

KiranRahay : తండ్రి కాబోతున్న యంగ్ హీరో.. ఫోటో రిలీజ్