NTV Telugu Site icon

Seethakka: ప్రజా భవన్ను మంత్రి సీతక్క ఆకస్మిక సందర్శన.. ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ

Seethakka

Seethakka

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ను పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ రోజు ఆకస్మికంగా సందర్శించారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నారెడ్డితో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు, అధికారులకు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ డ్రైవర్ కమ్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలల్లో పెరిగినందున ప్యాకేజీ పెంచాలని కోరారు.

Read Also: Noor Malabika Das: సూసైడ్ కి ముందు గుండు కొట్టించుకున్న నటి?

అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 702 దరఖాస్తులు నమోదయ్యాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 219 దరఖాస్తులు, మున్సిపల్ శాఖకు సంబంధించి 54, హోం శాఖకు సంబంధించి 52, హౌసింగ్ శాఖకు సంబంధించి 44, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 46, ఇతర శాఖలకు సంబంధించి 287 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు దివ్య, ఇతర అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు స్వీకరించండంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు తీర్పు..