Site icon NTV Telugu

Minister Seethakka: జంపన్న వాగును అభివృద్ధి చేస్తాం.. 29 ఎకరాల్లో స్మృతి వనం!

Minister Seethakka

Minister Seethakka

సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో మేడారం ‘సమ్మక్క సారలమ్మ’ జాతరకు వసతులు కల్పిస్తున్నాం అని తెలంగాణ మహిళ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. జంపన్న వాగును పర్యాటక శాఖతో కలిసి అభివృద్ధి చేస్తాం అని, స్మృతి వనాన్ని 29 ఎకరాల్లో ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తాం అని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది మేడారంలో జరిగే జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసింది.

Also Read: Telangana Aarogyasri: తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్!

‘మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతుంది. మేడారం జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు రిలీజ్ చేసింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారంలో జరుగుతుంది. జాతర ముందస్తు పనుల కోసం సీఎం రేవంత్‌ రెడ్డి నిధులు కేటాయించారు. జంపన్న వాగు నుంచి ఊరి వరకు డివైడర్లతో డబుల్ రోడ్ వేస్తున్నాం. 29 ఎకరాల దేవాదాయ శాఖ భూమిలో స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాము’ అని మంత్రి సీతక్క చెప్పారు.

Exit mobile version