Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: ఉద్యోగులు హక్కులతో పాటు విధులు కూడా గుర్తుంచుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. స్త్రీనిధి సంస్థను అందరం కాపాడుకోవాలన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి తోడ్పాటు అందిస్తోందని వెల్లడించారు. మైక్రో ఫైనాన్స్ బాధల నుంచి మహిళలకు విముక్తి కోసం స్త్రీనిధి ఏర్పాటయిందని తెలిపారు. ఇప్పటివరకు రూ.24 వేల కోట్ల రుణాలు పంపిణీ చేసిన స్త్రీనిధి అని చెప్పారు. 32 లక్షల మహిళలకు రుణాలు అందించిందని స్పష్టం చేశారు. తెలంగాణ మహిళలకు నమ్మకమైన బ్యాంక్‌గా స్త్రీనిధి ఎదగాలన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ స్త్రీనిధి మోడల్‌ను అనుసరిస్తున్నాయని.. మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్న స్త్రీ నిధి బ్యాంక్‌పై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు వస్తే వెంటనే వెరిఫై చేసి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అప్పుడు ఆరోపణలతో సంస్థ ప్రతిష్ట దెబ్బతినకూడదని మంత్రి వివరించారు. మహిళల అభివృద్ధే సమాజ అభివృద్ధికి పునాది అని చెప్పారు.
“చిన్న వ్యాపారాలు, గృహాధారిత ఉపాధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందింది. ఆదివాసీ మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నాం. స్త్రీనిధి మహిళల కోసం మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థ. స్త్రీనిధిని కాపాడుకోవాలి. ఉద్యోగ అనుకూల ప్రభుత్వం మా ప్రభుత్వం. స్త్రీ నిధి ఏర్పాటులో, దాన్ని విజయవంతం చేయడంలో కృషిచేసిన విద్యాసాగర్ రెడ్డికి అభినందనలు. నూతన నాయకత్వంలో ఈ సంస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.” అని మంత్రి సీతక్క వెల్లడించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..