NTV Telugu Site icon

Minister Seethakka : అధికారులంతా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి

Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka : అధికారులంతా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు మంత్రి సీతక్క. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పని చేయండని ఆమె వ్యాఖ్యానించారు. మీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోండని, నిబద్ధతతో పనిచేసి శాఖ గౌరవాన్ని నిలబెట్టాలన్నారు. శాఖకు వన్నె తెచ్చేలా పనిచేయాలని ఆమె సూచించారు. శాఖపరంగా వాస్తవాలనే నివేదించండని, మా మెప్పుకోసం వాస్తవాలను దాచి పెట్టొద్దన్నారు. అధికారులు, అమాత్యులు వేరు వేరు కాదని, మీరు పొరపాట్లు చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయొద్దన్నారు మంత్రి సీతక్క. ఎవరూ తప్పులు చేయొద్దు, జైలు పాలు కావద్దని, మీ కింది ఉద్యోగులతో సంప్రదింపులు జరపండి, వారి సమస్యలను పరిష్కరించండన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైందని, రూ. 300 కోట్ల nrega బిల్లులను నిన్న విడుదల చేశామన్నారు. మల్టీ పర్పస్ వర్కర్ల వేతన బకాయిలను విడుదల చేశామని, పంచాయతీరాజ్ శాఖ తరహాలోనే ప్రతి విభాగంలో ఉద్యోగ సమస్యలను ఆన్లైన్ లో పరిష్కరించే విధానాన్ని అవలంబించండన్నారు మంత్రి సీతక్క.

Saif Ali Khan: రక్తం కారుతున్న సైఫ్‌ అలీ ఖాన్‌ని “ఆటో”లో తీసుకెళ్లిన కొడుకు..

Show comments