NTV Telugu Site icon

Minister Seethakka : కేటీఆర్, కేసీఆర్ లకు ఇంకా బుద్ధి రావడం లేదు

Seethakka

Seethakka

కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ డమ్మీ క్యాండిడేట్ అని కేటీఆర్ దురహంకారంతో మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. కేటీఆర్ దురహంకారీ,ఆడవాళ్ళు అంటే గౌరవం లేదని, బొజ్జు, సుగుణ లాంటి అనామకులే ఈ రోజు మిమ్మలిని ఓడించారన్నారు. తెలంగాణ ప్రజల త్యాగాల మీద నీకు పదవులు వచ్చాయని, కేటీఆర్, కేసిఆర్ కు ఇంకా బుద్ధి రావడం లేదన్నారు మంత్రి సీతక్క. కేటీఆర్ నీకన్న సుగుణ ఎంతో గొప్ప అని, నోరు జారకు కేటీఆర్ డబ్బు లేనోళ్ళు అనామకులా? అని ఆమె అన్నారు. నీలాగా దోచుకున్న డబ్బు మా దగ్గర లేదని, మీ లెక్క ఫోన్ ట్యాపింగ్ లు చేయాలే అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అనుభవం లేనోళ్లు రాజకీయం లో రాకూడదా??ఇంత అహంకారమా మీకు?? ప్రాణ త్యాగాలు చేసే పార్టి కాంగ్రెస్ పార్టీ. వాళ్ళేమో ఉన్నోళ్ల పక్షాన ఉన్నారు ..పేదల పక్షాన రాహుల్ గాంధీ ఉన్నారు. 10ఏళ్లుగా బిజెపి ఎం ఇచ్చింది? గుడి గురించి చర్చ చేసే బిజెపి బడులకు ఏం ఇచ్చింది. వందల ఏండ్ల నుండి మతాలు ఉన్నాయి కానీ మతతత్వం లేదన్నారు మంత్రి సీతక్క.

అంతేకాకుండా..’అభివృద్ధి అడిగితే అక్షింతలు పంపడం కాదు, అభివృద్ధి చేసి చూపించండి. ఎన్నో చట్టాలు చేసింది కాంగ్రెస్ ,మరి బీజేపీ ఏం చేసింది. బొగ్గు బావులు అంబానీ ఆదాని లకు ఇచ్చే ఆలోచన చేస్తుంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కాదు త్యాగాల పార్టీ. దేశం కోసం 11ఏండ్లు జైల్లో గడిపిన మనిషి కాంగ్రెస్ పార్టీ మనిషి. బీజేపీ పార్టీకి జంతువుల మీద ఉన్న ప్రేమ అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసులపైన లేదు. కేంద్రం జీఎస్టీ పేరుతో దోపిడీ చేస్తుంది.’ అని మంత్రి సీతక్క అన్నారు.