NTV Telugu Site icon

Minister Seethakka : రైతు యాత్ర అని పెట్టారు.. ఏదో ఏదో మాట్లాడారు

Seethakka

Seethakka

రైతు యాత్ర అని పెట్టారు.. ఏదో ఏదో మాట్లాడారన్నారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 40 వేల కోట్లు పెట్టిన మిషన్ కాకతీయ చెరువుల్లో నీళ్ళు ఉండాలి కదా అని ఆమె అన్నారు. కట్టిన కాళేశ్వరం కూలిపాయే అని ఆమె విమర్శించారు. కావాలని బురద జల్ల వద్దని ఆమె హితవు పలికారు. అధికారం పొతే గాని ప్రజలు గుర్తుకు రాలేదని, రాష్ట్ర పతి పదవి ఆదివాసి కి ఇచ్చాము అని చెప్పుకున్న బిజేపి… కనీసం గౌరవం ఇవ్వలేదన్నారు. దేశ మొదటి పౌరురాలుకు గౌరవం ఇవ్వడం లేదమని మంత్రి సీతక్క మండిపడ్డారు.బిజేపి అధికారం ఉంటే ఆదాని నచ్చిన వాళ్లకు అంబానీ మెచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఉంటాయన్నారు.

అంతేకాకుండా..’ మాప్రభుత్వాన్ని టచ్ చేస్తే వాళ్లే మసైపోతారు.. రాజ్యంగం బద్దంగా ఏర్పడిన మా ప్రభుత్వాన్ని కూల్చుతాం పేల్చుతాం అనేది రాజ్యంగ విరుద్దమైన పదం. కేసిఆర్ ఎప్పుడు సెంటిమెంట్ తో రాజకియాలు చేస్తారు. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన చరిత్ర వారిది.. 2 వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనే మాజీ సీఎం మాటల్లో వాస్తవం లేదు. దబాయించి ఇతరుల నోర్లు మూచించిన చరిత్ర కేసిఆర్ ది. దుర్మార్గమైన అబ్బద్దపు ప్రచారాలు చేయడంలో ఆయన దిట్ట. మహేశ్వర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల ఇంతలా మాట్లాడుతున్నారు. కూల్చుతామనే దురహంకారణం,కాశాయఅహంకారం ఎందుకు అంటూ సీతక్క ప్రశ్న. రేవంత్ రెడ్డి సీఎం కావడంను మహేశ్వర్ రెడ్డి తట్టుకోలేక పోతున్నారు. ఆరోపణలు ఉన్న నాయకులను కాదు.. మంచి వ్యక్తులను చూస్తున్నాం..మాపార్టీ కార్యకర్తల ఆమోదంతోనే చేరికలు జరుగుతున్నాయి.’ అని మంత్రి సీతక్క అన్నారు.