Site icon NTV Telugu

Seethakka: బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదో బండి సంజయ్ చెప్పాలి..

Seethakka

Seethakka

కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదో బండి సంజయ్ చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలన్న బండి సంజయ్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని సీతక్క అన్నారు. 2013లో ఆహార భద్రత చట్టాన్ని తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని సీతక్క స్పష్టం చేశారు. బండి సంజయ్ కి గుర్తింపు సమస్య ఉంది. కాంగ్రెస్ పార్టీని తిడితే గుర్తింపు వస్తుందని బండి సంజయ్ ఆలోచన అని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ చూస్తుంది. ప్రజలకు తినడానికి లేని రోజుల నుండి.. ఈరోజు సన్నబియ్యం ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని సీతక్క వెల్లడించారు.

Exit mobile version