Minister Seethakka: నూతనంగా నియమితులైన AEEలకు అభినందనలు
- అక్కడ బ్రిడ్జిలు కూలి అనేక మంది చనిపోయారు
- ఆ దుర్ఘటనలు గుణపాఠంగా తీసుకుని పనిచేయాలి
- వందల సంవత్సరాలు నిలిచే బిల్డింగులే మన పని తనానికి సాక్ష్యంగా నిలిస్తాయి
- ఎలాంటి రాజకీయ.. ఇతర ఒత్తిడి లకు లోను కావద్దు.. నిక్కచ్చిగా పనిచేయండి : మంత్రి సీతక్క
ఎర్రమంజిల్ లోని పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఇటీవల నియామక పత్రాలు అందుకున్న AEE లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మంత్రి సీతక్క ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నూతనంగా నియమితులైన AEEలకు అభినందనలు తెలిపారు. అందరూ నిబద్ధతతో అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని, మీ పని తనమే మీకు గుర్తింపు తెచ్చిపెడుతుందన్నారు. నాణ్యత పై ఎక్కడ రాజీ పడొద్దని, శాశ్వతంగా నిలిచిపోయేలా మీ పనులు ఉండాలన్నారు. మీ కుటుంబానికి ప్రభుత్వానికి మంచి తెచ్చి పెట్టేలా పనులు చేయాలని, ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకొని ఉద్యోగాలు సాధించారన్నారు. చదువు వేరు… ప్రాక్టికల్స్ వేరు అని, మీకు ఎంతో విద్యా అనుభవం ఉన్నా ఇక్కడ మీకు ప్రాక్టికల్స్ నేర్పిస్తామన్నారు. నేను లాయర్ గా కొంతకాలం ప్రాక్టీస్ చేశానని, రైటర్ కు ఉన్నంత ఎక్స్పీరియన్సు జూనియర్ అడ్వకేట్లకు ఉండదన్నారు. మన విద్యా క్వాలిఫికేషన్ ఉన్న…సీనియర్లకువర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది…పబ్లిక్ తో ఎట్లా ఉండాలో తెలుస్తదన్నారు మంత్రి సీతక్క. పనులు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటదని, అందుకే తప్పకుండా సీనియర్ల అనుభవం నుంచి నేర్చుకోవాలన్నారు మంత్రి సీతక్క.
అంతేకాకుండా..’సీనియర్ల అనుభవం మీకు ఎంత గానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మక్కికి మక్కి అనే సామెతను అనుసరించ వద్దు. స్థానిక పరిస్థితులను బట్టి పనులను అంచనా వేసి ఎక్స్క్యూట్ చేయాలి. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. బీహార్ లో చాలా బ్రిడ్జిలు కూలి పోతున్నాయి.
అక్కడ బ్రిడ్జిలు కూలి అనేక మంది చనిపోయారు అక్కడ బ్రిడ్జిలు కూలి అనేక మంది చనిపోయారు. ఆ దుర్ఘటనలు గుణపాఠంగా తీసుకుని పనిచేయాలి. వందల సంవత్సరాలు నిలిచే బిల్డింగులే మన పని తనానికి సాక్ష్యంగా నిలిస్తాయి. ఎలాంటి రాజకీయ, ఇతర ఒత్తిడి లకు లోను కావద్దు, నిక్కచ్చిగా పనిచేయండి. ఏ లక్ష్యంతో చదువుకుని, ఉద్యోగం సాధించారో ..అదేలక్ష్యంతో పని చేయాలి. మీరు చేసే ప్రతి పని అద్భుతంగా గొప్పగా ప్రజలు చెప్పుకునేటట్లుగా మిగిలాలి. మన వృత్తికి మనం వన్నెతెచ్చామా లేదా అన్నదే ముఖ్యం. గొప్ప ఇంజనీర్లు కావాలన్న మీ కలలను నెరవేర్చుకోండి. ఒక వున్నత హోదాలో రిటైర్ అయ్యేలా పనిచేయండి. ఉద్యోగం తెచ్చిన సంబరం రిటైర్మెంట్ వరకు వుండేలా పని చేయాలి. అంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే. ఆ ప్రాంతాలకు రవాణా సౌకర్యం, ఇతర వసతులు కల్పించడం మీ బాధ్యత. రవాణా సదుపాయం ఉన్న ప్రాంతాలే త్వరగా అభివృద్ధి చెందుతాయి. అందుకే గ్రామీణ మూలాలు ఉన్నా మీరు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయండి. సకాలంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తిచేయాలి. అభివృద్ధి పనుల్లో మీ మార్కును చూపించండి. ఎట్టి పరిస్థితుల్లో తప్పు దారి పట్టదు. తల్లిదండ్రులకు తలపంపులు తేవద్దు. నాణ్యత సరిగా లేకపోతే సస్పెండ్ అవుతారు. ఇటిక మీద ఇటుక పేర్చి భవనాలు నిర్మించినట్టే.. మీ కెరీర్‌ను కూడా నిర్మించుకోండి.
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
ఒక టార్గెట్ పెట్టుకొని సకాలంలో జాగ్రత్తగా పనులు చేయాలి. సిన్సియర్గా వర్క్ చేయాలి. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన నేను ఒక్కో అడుగు వేస్తూ ఈ స్థాయికి వచ్చాను. కులము, కుటుంబ నేపథ్యము, ధనము లేవు.. కష్టపడ్డా కష్టంతో ఎదిగాను. 10 సంవత్సరాల ఉద్యమాల్లో ఉన్న, 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. తల్లిదండ్రుల నుంచి కష్టాన్ని నేర్చుకున్నాను. మన కష్టమే ప్రజల్లో మనకు ఒక స్థానాన్ని ఇస్తుంది. కష్టాన్ని ఇష్టంగా ఎంచుకొని పనిచేయండి. మీ వృత్తి ధర్మాన్ని మరవద్దు. నిజాయితీ నిబద్దలతో కష్టాన్ని జోడించి పనిచేస్తే అద్భుతమైన ఇంజనీర్గా రాణిస్తారు. 1375 కోట్ల రూపాయలు తో గ్రామ రహదారులను నిర్మిస్తున్నాం. మీ హయాంలో ఈ పనులు ప్రారంభం కావడం మీ అదృష్టం. అంత గ్రామాల నుంచి వచ్చిన వారమే గ్రామాలకు మనం తిరిగి సేవ చేయాలి. ఉద్యోగిగా కాకుండా సేవకుడి లాగా పని చేయాలి. మనసుపెట్టి పని చేసినన్నపుడు వచ్చే సంతృప్తి కి మించింది లేదు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో త్వరలో 500 కు పైగా కారుణ్య నియామకాలను చేపడతాం. సీఎం, రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా అంగీకరించింది. ప్రజల అవసరాలు, ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టుగా పనిచేయాలి. మన శాఖకు వన్నె తీసుకురావాలి. మీ సమస్యలు ఏమున్నా వీలైనంతవరకు పరిష్కరిస్తా. ప్రతి ఊరుతో అనుబంధం ఉన్న శాఖ పంచాయతీ శాఖ. ప్రతి ఊరికి మన శాఖతో అనుబంధం ఉంది. ప్రతి అడుగులో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి. తెలియక చిన్న పొరపాట్లు జరిగిన వెంటనే సరిదిద్దుకోవాలి.
అప్పుడు ఎక్కడా తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నత స్థానంలోకి వెళ్ళగలుగుతారు. ఒక అట్టడుగు వర్గాల ఆదివాసి వర్గానికి చెందిన మహిళకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖను అప్పగించి పనిచేసే అవకాశం కల్పించారు. మీరు కూడా కష్టపడితే ఉన్నత స్థానానికి ఎదుగుతారు. పుట్టుకకు చావుకు మధ్య జీతం కాదు.. జీవితం కూడా ఉందని గ్రహించాలి. హైదరాబాద్ వంటి నగరాల నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఇంజనీర్లను మీరు ఆదర్శంగా తీసుకోవాలి.’ అని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం enc కనక రత్నంతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్తగా నియమితులైన ఏఈ ఈలకు శాఖ డైరీలను మంత్రి అందజేశారు. మంత్రిని ఘనంగా సన్మానించిన నూతన ఏఈఈలు, సీనియర్ ఉద్యోగులు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం enc కనక రత్నంతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్తగా నియమితులైన ఏఈ ఈలకు శాఖ డైరీలను మంత్రి అందజేశారు. మంత్రిని నూతన ఏఈఈలు, సీనియర్ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!