Minister Seethakka : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి కొండా సురేఖతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అటవీ పరిసర గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా అటవీ శాఖ నిబంధనల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చ జరిగింది. ఈ సమన్వయ సమావేశానికి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అటవీశాఖ ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, ఐటిడిఎ అధికారులు హాజరయ్యారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకువస్తున్నారని, ప్రజల తరఫున ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు.
Tirumala: తిరుమలలో వరుస అపచారాలు.. మొన్న నమాజ్.. నేడు మద్యం తాగి..
అటవీ గ్రామాల్లో కనీస వసతులైన రోడ్లు, ఆస్పత్రులు, పాఠశాలలు, తాగునీరు, కరెంటు లైన్లు ఏర్పాటు చేయడానికి అటవీశాఖ సహకరించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. అడవుల్లోని చట్టాలను చూపించి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడకూడదు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలి, గ్రామాల్లో కాకుండా అని సూచించారు మంత్రి సీతక్క. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితుల మేరకు అనుమతులు ఇవ్వకుండా, ఫైళ్లను తేడాలు చూపుతూ పెండింగ్‌లో వేయడం అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అడవిలో నివసించే ఆదివాసీలకు తునికాకు, అడవి పండ్ల సేకరణపై అటవీ చట్టం హక్కు ఇస్తున్నప్పటికీ, అధికారులు అడుగడుగునా వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు.
అటవీ పరిరక్షణతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సజావుగా సాగాలన్నారు మంత్రి సీతక్క. ఈ రెండింటికీ సమన్వయం అవసరం. అవసరమైతే చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా అనుమతులు తెప్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ సమావేశం ద్వారా అటవీ గ్రామాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయని, అన్ని శాఖల మధ్య సమన్వయంతో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొననున్నట్లు వెల్లడించారు.
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ మొత్తం ఫుటేజీ 7.30 గంటలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఎడిటర్
