Minister Seethakka : గత ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీని ట్రబుల్ ఐటీగా మార్చిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఇవాళ ఆమె నిర్మల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మసగ బారిన ట్రిపుల్ ఐటీ ప్రతిష్టను ఉన్నత స్థితికి తీసుకెళ్లుతామన్నారు. తక్షణ అవసరాల కోసం కోటి రూపాయల నిధులు కేటాయించామని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు పలు సమస్యలను అదృష్టం తీసుకొచ్చారని, వాటన్నింటినీ వీలైనంత తొందరగా పరిష్కరిస్తామన్నారు మంత్రి సీతక్క. ఫుడ్ కాంట్రాక్టర్ డ్రైనేజీ లాప్టాప్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, ట్రిపుల్ ఐటీ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. అంతేకాకుండా.. విద్యార్థులు ఆత్మహత్యల వైపు వెళ్లకుండా మానసిక స్థైర్యాన్ని నింపడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
Donald Trump: ఇండియన్స్‌కి ట్రంప్ షాక్.. 18,000 మంది బహిష్కరణ..!
విద్యార్థులకు బాధలు కలిగినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పోయేదన, ఇప్పుడు వీసీ ఇక్కడే ఉంటున్నారని, మీకు ఏ సమస్య వచ్చినా వీసి , కలెక్టర్ ఎస్పీ అందరూ అందుబాటులో ఉంటారనే ధైర్యాన్ని ఇస్తున్నారన్నారు మంత్రి సీతక్క. ట్రిపుల్ ఐటీ పిల్లలు మా బిడ్డలే వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. విద్యార్థులపై నమోదైన కేసుల విషయాన్ని పరిశీలిస్తాం ..వారి పైన కేసులు తీసివేయడం కోసం తగిన చర్యలు చేపట్టుతా అని ఆమె వెల్లడించారు.
Bandi Sanjay : అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన బండి సంజయ్