Minister Seediri: టీడీపీపై రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చిన నుండి ఏపీలో రెండే పోర్టులు ఉండటం బాధాకరమని అన్నారు. 14 ఏళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఎందుకు కొత్తగా ఒక్క పోర్టులకు నిర్మాణం చేయలేదని ప్రశ్నించారు. కనీసం శంఖుస్థాపన కూడా ఎందుకు చేయలేదన్నది సూటి ప్రశ్న అని అన్నారు. అభివృద్ధిపై చర్చకు రావాలని నారా లోకేష్ కి సవాల్ విసిరాను.. కానీ ఆయన రాలేదని తెలిపారు.
Read Also: Ram Mandir: శ్రీరాముడి కోసం బంగారు పాదరక్షలు.. 8 వేల కి.మీ పాదయాత్ర చేస్తున్న హైదరాబాద్ వ్యక్తి..
నారా లోకేష్ రాష్ట్రంలో ఎక్కడైనా చంద్రబాబు హయాంలో శంకుస్థాపన చేసిన, లేదా నిర్మాణం చేసిన, పోర్టు లేదా హార్బర్ ముందు ఉండి ఫోటో తీసి పంపమంటున్నట్లు మంత్రి సీదిరి పేర్కొన్నారు. అలా లోకేష్ పంపితే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో 8 పోర్టులు, 10హార్బర్ ల నిర్మాణంతో దేశంలోనే శక్తివంతమైన రాష్ట్రంగా ఏపీ అవతరించబోతుందని అన్నారు. ఇది చిత్తశుద్ది అంటే, ఇది సంపద సృష్టించటం అంటేనని పేర్కొన్నారు. నారా భువనేశ్వరి అసలు జిల్లా పర్యటనకు వచ్చిన విషయం ప్రజలకు తెలియదని విమర్శలు చేశారు.