ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై మంత్రి సౌరభ్ భరద్వాజ్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ప్రజలకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తున్న ప్రజలు ఎన్నుకున్న సీఎంకు మందులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కేజ్రీవాల్ తన షుగర్ స్థాయి పెరిగిందని, తనకు ఇన్సులిన్ అవసరమని చెబుతున్నా.. అందుకే ఇన్సులిన్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. కాగా, జైల్లో అరవింద్ కేజ్రీవాల్‌ను నెమ్మదిగా హత్య చేస్తున్నారని మంత్రి సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు. డయాబెటిక్ పేషెంట్‌కు ఇన్సులిన్ ఇవ్వకపోతే అతని నరాలు బలహీనంగా మారిపోయాన్నారు. ఈ నరాల బలహీనత కారణంగా, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె లాంటివి శరీరంలోని ప్రతి అవయవం క్రమంగా పని చేయకపోవడంతో చివరికి ఆయన వికలాంగుడిగా మారిపోయే ప్రమాదం ఉంది.. ఈ అవయవ వైఫల్యం కారణంగా రోగి తన ప్రాణాలను కోల్పోతాడని మంత్రి చెప్పుకొచ్చారు.
Read Also: Namburu Sankara Rao: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైసీపీలోకి 35 కుటుంబాలు
అయితే, కేజ్రీవాల్‌తోనూ అదే విధంగా కుట్ర జరుగుతోందని మంత్రి సౌరభ్ ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యం దెబ్బ తినేలా సకాలంలో మందులు ఇవ్వకూడదని ఈ వ్యక్తులు కోరుతున్నారు అంటూ మండిపడ్డారు. కేజ్రీవాల్ కొన్ని నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలేయం, ఊపిరితిత్తులు, గుండెకు చికిత్స పొందుతూ క్రమంగా మరణించే అవకాశం ఉందన్నారు. కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అవసరమైతే ఇన్సులిన్ ఇవ్వాల్సిందేనని మేము కోరుకుంటున్నామని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు.