NTV Telugu Site icon

Minister Satyavati Rathod: వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన

Minsiter Satyavathi

Minsiter Satyavathi

ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని సత్యవతి రాథోడ్ అన్నారు. ఇవాళ (శనివారం) జిల్లాలోని పస్రా నుంచి ఏటూరు నాగారం వైపు వెళ్లే దారిలో ఉన్న గుండ్ల వాగు రోడ్డు పునరుద్ధరణ పనులను ఆమె పరిశీలించారు. అనంతరం గోవిందరావు పేట, ఏటూరు నాగారం మండలాల్లో బాధితులకు ఆహార వస్తువులను పంపిణీ చేశారు.

Read Also: Ponguleti Srinivas Reddy : ముందు గత వరదలకు మీరు ప్రకటించిన 1000 కోట్లు ఇవ్వండి

గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో అత్యధిక వర్షాపాతం నమోదు అయిందని రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గుండ్ల వాగు ప్రాజెక్ట్, దయ్యాలవాగు జంపన్న వాగు, ప్రవాహం వలన కొండాయి గ్రామం పూర్తిగా దెబ్బతినగా 8 మంది చనిపోయారని తెలిపింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 55 మందిని రక్షించాయని మంత్రి పేర్కొన్నారు. ఆస్తి నష్టం, పంట నష్టాలను అంచనా వేసి తక్షణమే ప్రభుత్వ సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.

Read Also: Seven Sixes: ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టిన ఆప్ఘనిస్థాన్ యువ క్రికెటర్

అలాగే, కొండాయి గ్రామంలో పర్యటించిన మంత్రి వరదలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులకు అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్ బరోసా ఇచ్చారు. అనంతరం వరద బాధితులకు ఆమె ఆహారం అందించారు. రవాణా సౌకర్యం కొరకు కూలిపోయిన బ్రిడ్జినీ పునర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల నుంచి తరలించి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని స్థానిక ప్రజలు వేడుకున్నారు. అయితే, ఈ విషయంపై క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడి ఇళ్లు ఇచ్చేలా చర్యలు చేపడుతామని మంత్రి హామీ ఇచ్చారు. వరదలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను కాపాడల్సిన సమయంలో కొంతమంది కావాలని రాజకీయాలు చేయడం సరికాదు అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.