Site icon NTV Telugu

Breaking : మంత్రి సత్యవతిరాథోడ్‌కు మాతృవియోగం

Satyavati Rathod

Satyavati Rathod

Telangana Minister Satyavati Rathod Mother Dasmi Bai Passes Away.

రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. మంత్రి సత్యవతి రాథోడ్‌ తల్లి గుగులోత్‌ దాస్మీ బాయి నేడు కన్నుమూశారు. దాస్మీ బాయి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రి చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరి మంత్రి సత్యవతి రాథోడ్‌ తండ్రి గుగులోత్‌ లింగ్యా నాయక్‌ మరణించారు. ఆయన కూడా అనారోగ్యంతో బాధపడుతూ.. మహబూబాబాద్‌ జిల్లా కురివి మండలం పెద్దతండాలో గల తన నివాసంలో మృతి చెందారు. ఈ ఏడాడి సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్‌ తండ్రి మరణవార్త తెలిసి హుటాహుటినా పెద్దతండాకు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. మంత్రి సత్యవతి రాథోడ్‌ మాతృమూర్తి దాస్మీబాయి మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. సత్యవతి రాథోడ్‌ కుటుంబానికి కేసీఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

 

Minister Satyavati Rathod, Satyavati Rathod Mother Passes Away, Breaking News, Latest News,

Exit mobile version