Minister Satya Kumar Yadav: మంత్రి లోకేష్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ విజ్ఞప్తి చేశారు. రాయలసీమలో మహిళలకు ప్రత్యేక ఇంజనీరింగ్ కళాశాల కోసం విద్యా మంత్రి లోకేష్‌ను మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం తెలుగు వారి కోసం అంతర్జాతీయంగా అనేక సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకుని అద్భుతాలు సాధించిందన్నారు. ప్రస్తుతం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో పయనిస్తున్నామని.. జనాభాలో సగం వున్న మహిళలకు స్థిరమైన అభివృద్ది అవకాశాలు కల్పించే అంశంపై సీఎం చంద్రబాబు స్ఫూర్తితో దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: Andhra Pradesh: గుడ్‌న్యూస్.. రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లలో తీసుకెళ్లేందుకు అనుమతి
రాయలసీమ సామాజిక, ఆర్థిక పరిస్థితులను, విభిన్నమైన పాలనను అందించాలన్న ఎన్డీయే కూటమి సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని మంత్రి లోకేష్‌ను కోరారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రత్యేకంగా మహిళల కోసం ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని అనంతపురం జేఎన్టీయూ ప్రతిపాదించిందన్నారు. సంబంధించిన డీపీఆర్‌ను లోకేష్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖలో పంపారు. డీపీఆర్‌ను పరిశీలించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు.