NTV Telugu Site icon

Minister Satya Kumar Yadav: వర్షాకాలంలో ఆ నీరు తాగండి.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..!

Satya Kumar Yadav

Satya Kumar Yadav

Minister Satya Kumar Yadav: వర్షాకాలంలో సీజన్‌ వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక సూచనలు చేశారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్.. వర్షాల సమయంలో కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగండి అని సూచించిన ఆయన.. ఏ నీటినిపడి ఆ నీటిని తాగి ప్రాణాల మీదుకు తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు.. ప్రజలు కూడా వీటి పై అవగాహన తెచ్చుకుని పరిసరాల శుభ్రత పాటించాలన్నారు.. మా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం లో ఆర్ధిక విధ్వంసం జరిగింది.. అన్ని మంత్రిత్వ శాఖలు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.. వైద్య రంగంలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయి.. వీటిపై విచారణ చేసి త్వరలో చర్యలు తీసుకుంటాం అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కూడా నిధులు లేకుండా చేశారు.. ప్రధాని మోడీ సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం అన్నారు.

Read Also: Pithapuram MLA Taluka : నెంబర్ ప్లేట్ పై ‘‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’’.. ఆ ఒక్క చోట కాకుండా ఎక్కడైనా అంటూ..

ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. ప్రభుత్వం ముందు చర్యలు తీసుకుంది.. అక్కడక్కడా కొన్ని చోట్ల అతిసారం ప్రబలిందన్నారు మంత్రి సత్యకుమార్.. ఎన్నికల నేపథ్యంలో అక్కడ దృష్టి సారించలేదని తెలిసింది.. ఇక నుంచి ఇతర శాఖల సమన్వయం తో పని చేస్తాం.. కలుషిత నీరు వల్ల అతిసారంతో ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు.. గత కొన్ని ఏళ్లుగా ఓవర్ హెడ్ ట్యాంక్ లు, పైపు లైన్లు సరి చేయలేదని విమర్శించారు. పైపులు లీకు అయ్యి మంచినీటిలో కలిసిన పరిస్థితి ఉంది.. మా శాఖ వరకు అన్ని ప్రాంతాలలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.. ఆస్పత్రిలో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నాం అన్నారు.. ఇక, వర్షాల సమయంలో కాల్చి చల్లార్చిన నీరు మాత్రమే తాగండి.. ఆరోగ్యంగా ఉండాలని సలహా ఇచ్చారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్.

Read Also: Producer Niranjan Reddy- Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ తో నిరంజన్ సాహసం..!

ఇక, విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడులు జరిగాయి.. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు.. శ్యాం ప్రసాద్ గురించి భావి తరాలు తెలుసుకోవాలి.. జాతి నిర్మాణం, దేశ సమైక్యతకు శ్యాం ప్రసాద్ ఎంతగానో పాటుపడ్టారు.. దేశం ప్రాధాన్యాత అని నినదించిన వ్యక్తి శ్యాం ప్రసాద్ .. విద్యారంగంలో అనేక సేవలందించారు.. శ్యాం ప్రసాద్ ముఖర్జీ మంచి దర్శనీయకుడు అని కొనియాడారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్. మరోవైపు.. విజయవాడలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు.. యనమలకుదురులో పీహెచ్సీ ప్రారంభించి స్ధానిక వైద్య అధికారులతో సమీక్షించారు. ప్రజారోగ్యం ప్రధాన ధ్యేయంగా ఉద్యోగులు పని చేయాలని ఆదేశించారు..