మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డికి ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి కార్యకర్తలకు గుండు సూది గుచ్చాలని చూసినా.. గునపాలు దిగుతాయి జాగ్రత్త అని హెచ్చరించారు. పోనీలే అని ఊరుకుంటున్నాం అని, ఇలాగే మాట్లాడితే ఉపేక్షించే పరిస్థితి ఉండదన్నారు. అధికారం అడ్డం పెట్టుకుని ఏదైనా చేస్తే ఒక్కరు కూడా ఊళ్లో ఉండలేరన్నారు. ఎవరైనా ప్రజల జోలికి వస్తానంటే తాటతీస్తాం అంటూ మంత్రి సత్యకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేతి రెడ్డి 3.0 వ్యాఖ్యలపై మంత్రి ఇలా ఫైర్ అయ్యారు.
Also Read: Rohit Sharma: ఇక ఆడతామో లేదో.. హింట్ ఇచ్చేసిన రోహిత్ శర్మ!
‘పోనీలే అని ఊరుకుంటున్నాం. ఇలాగే మాట్లాడితే ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. అధికారం అడ్డం పెట్టుకుని ఏదైనా చేస్తే ఒక్కరు కూడా ఊళ్లో ఉండలేరు. కేతి రెడ్డి ఫారిన్ ట్రిప్పులు కూడా పోలేడు. మీకు అధికారం కావాలేమో.. మాకు అది కూడా అవసరం లేదు. ప్రజల జోలికి వస్తానంటే తాటతీస్తాం. మీ కార్యకర్తలు పార్టీ విడిపోతుంటే బ్రతిమలాడు తప్పులేదు. ఎవరికి దీపావళి ఉండదో, దసరా ఉండదో చూపిస్తాం. కూటమి కార్యకర్తలకు గుండు సూది గుచ్చాలని చూసినా గుణపాలు దిగుతాయి. ఇలాంటి మాటలు మానుకో ఇప్పటికైనా. 11 సీట్లు ఉన్నాయి ఇప్పుడు.. రానున్న రోజుల్లో అవి కూడా ఉండవు’ అని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు.
