Minister Satya Kumar: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్.. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ పరామర్శ పేరుతో దండయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.. పోలీసులు రక్షణ ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు.. ఎక్కువ మంది పోలీసులను పెడితే.. 2 వేల మంది పోలీసులను పెట్టారని మళ్లీ ఇప్పుడు కామెంట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. 500 మందితో వెళ్లి రైతులను పరామర్శించాలని వైఎస్ జగన్‌కు చెప్పాం.. కానీ, ఆయన చేసింది ఏంటి? అంటూ మండిపడ్డారు.
Read Also: Siddaramaiah: హైకోర్టులో సిద్ధరామయ్యకు ఊరట.. బీజేపీ వేసిన పరువు నష్టం కేసు నిలిపివేత
గత ఐదేళ్లలో రైతులు గురించి ఏ రోజైనా పట్టించుకున్నారా..? అని వైఎస్ జగన్‌ను నిలదీశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. 250 కోట్ల రూపాయలు మామిడి రైతుల కోసం ఈ ప్రభుత్వం కేటాయించిందని స్పష్టం చే శారు.. గతంలో ధరల స్థిరీకరణ నిధి అని ఏం చేశారు? అని ప్రశ్నించిన ఆయన.. వైఎస్ జగన్ రైతుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అంటూ మండిపడ్డారు.. అసలు, గత ఐదేళ్లలో ధర్మవరం మున్సిపాలిటీ గురించి పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు.. గత ప్రభుత్వంలో కేవలం వైసీపీ వారికి మాత్రమే లబ్ధి చేశారని ఆరోపించారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
