NTV Telugu Site icon

Minister Sabitha: తెలంగాణ విద్యా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి..

Minister Sabhitha

Minister Sabhitha

తెలంగాణ విద్యారంగంలో గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను తెలిపారు. సచివాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా 21 రోజుల పాటు విద్యారంగంలోని విజయాలకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. 20న నిర్వహించే ‘తెలంగాణ విద్యా దినోత్సవం’ విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Also Read : GT vs CSK Qualifier-1: ఒక్క ప్లే ఆఫ్స్ లో 84 డాట్ బాల్స్.. 42వేల మొక్కలు నాటనున్న బీసీసీఐ

ప్రాథమిక పాఠశాల నుంచి పీజీ కళాశాల వరకు అన్ని విద్యాసంస్థల్లో సభలు, సమావేశాలను నిర్వహించి విజయాలను వివరించాలని మంత్రి సూచించారు. సర్కారు పాఠశాలలకు సకల హంగులు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కింద సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలను స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు. తొలి విడతలో రూ.3,497.62కోట్లతో 9,123 స్కూళ్లను 12 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.

Also Read : Meta Layoffs: మెటా మూడో రౌండ్ లేఆఫ్స్.. 5000 మంది ఉద్యోగాలు ఊస్ట్..

దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 10వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్ క్లాస్ రూమ్‌లను ఒకే రోజున ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి తెలిపారు. రూ.190కోట్లు ఖర్చు చేసి 30లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తున్నామని ఆమె అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలు పునః ప్రారంభం నాటికి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మొదటి సారిగా రూ.60కోట్లు వెచ్చించి 6 నుంచి 10వ తరగతి చదువుతున్న 12.39 లక్షల మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను అందిస్తున్నామన్నారు. 2లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ.10కోట్ల ఖర్చుతో ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేస్తున్నామని మంత్రి సబితా అన్నారు.