NTV Telugu Site icon

Minister Roja: పవన్‌పై మంత్రి ఫైర్‌.. జాతరలో వేపాకు పట్టుకొని ఉగినట్లు ఊగిపోతున్నారు..!

Minister Roja

Minister Roja

Minister Roja: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. పవన్ కల్యాణ్‌ ఈ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే కాలేడు అని జోస్యం చెప్పారు.. జాతరలో వేపాకు పట్టుకొని ఉగినట్లు ఊగడం తప్ప పవన్ కూ ఏమీ తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడం కాదు.. దమ్ముంటే రాష్ట్రం మొత్తంలో 34 మంది అభ్యర్ధులను సొంతంగా పవన్ కల్యాణ్ నిలబెట్టాలి అంటూ సవాల్‌ విసిరారు.. పవన్‌తో పాటు లోకేష్‌ కూడా మొదట ఎమ్మెల్యేగా గెలవాలి అని ఛాలెంజ్‌ చేశారు.

Read Also: SBI Offer : రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రూ. 3 లక్షలు పొందే అవకాశం..

మరోవైపు, సొంత జిల్లాకు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు చేసిందేమీ లేదంటూ మాజీ ముఖ్యమంత్రులపై విమర్శలు గుప్పించారు మంత్రి రోజా.. ఇక, ఓ మహిళకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పగించడం శుభపరిణామం అని వ్యాఖ్యానించారు.. తన నాన్న స్థాపించిన పార్టీ పగ్గాలు చేపట్టలేకపోయినా.. చివరకు బీజేపీ పగ్గాలు ఆమె అందుకుంటోందన్నారు. అమె కాదు నందమూరి కుటుంబంలో బాలకృష్ణ సహా ఎవరూ టీడీపీ పగ్గాలు చేపట్టలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి ఆర్కే రోజా. కాగా, వారాహి యాత్రలో అధికార పార్టీ, సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు నేతలపై పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. ఇదే సమయంలో.. సీఎం వైఎస్‌ జగన్‌ నుంచి మంత్రులు, అధికార పార్టీ నేతలు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై కౌంటర్‌ ఎటాక్‌ చేస్తున్న విషయం విదితమే.