Minister Roja: నిజం గెలవాలి.. మిగతా స్కాముల్లో కూడా దొరకాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్‌చేశారు.. ఆయన అరెస్ట్ అక్రమం.. నిజం గెలవాలి అంటూ.. నారా భువనేశ్వరి యాత్ర చేపట్టారు.. ఆ యాత్రపై కౌంటర్ ఎటాక్ దిగారు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. నిజం గెలవాలి.. మిగతా స్కాముల్లో కూడా చంద్రబాబు దొరకాలి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి ఆర్కే రోజా..
Read Also: Dipika Kakar: మార్కెట్లోకి కొత్త స్కామ్.. నేను బుక్కయ్యా, మీరు జాగ్రత్త అంటున్న నటి!
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టిన తర్వాత.. టీడీపీ నేతలు చిన్న మెదడు చితికిపోయినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు మంత్రి రోజా.. అసలు వందల కోట్లు చంద్రబాబు దోచుకోకపోతే.. ఇన్ని రోజులు చంద్రబాబు జైలులో ఎందుకు ఉంటాడు అని ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు.. కోట్లాది రూపాయాలు వెచ్చించి ఢిల్లీ నుంచి లాయర్లు వచ్చి వాదిస్తున్నా.. చంద్రబాబు బయటకు రావడం లేదన్న ఆమె.. ఒక్క కేసులో ఒక్క ఆధారంతోనే ఇన్ని రోజులు జైలులో ఉన్నాడంటే.. అన్ని కేసుల్లో నిజాలు బయటకు వస్తే.. జీవితాంతం జైలులోనే ఉండాల్సి వస్తుందని చంద్రబాబుకు కూడా అర్థమైంది.. అందుకే నిజం గెలవాలి అంటూ భువనేశ్వరితో యాత్ర ప్రారంభించారని విమర్శించారు.. మేం కూడా అదే కోరుకుంటున్నాం.. నిజం గెలవాలి.. అన్ని కేసుల్లో చంద్రబాబు ప్రమేయం బయటకు రావాలన్నారు.. అసలు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ వేల కోట్లు ఎలా సంపాదించాలో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. నా ఆస్తులపై చర్చ పెడుతున్నారు.. నా ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధం అని ప్రకటించారు మంత్రి ఆర్కే రోజా.. దీనిపై సీబీఐకి ఒకే లెటర్ రాద్ధాం.. మీ ఆస్తులు.. నా ఆస్తులు తెలాలంటూ సవాల్ చేశారు మంత్రి రోజా.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!