మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి నేడు. అయితే ఈ నేపథ్యంలోనే ఏపీలోని భీమవరంలో 30 అడుగుల సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సీతారామ రాజు విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో.. ఎన్టీవీతో ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు 125 జయంతోత్సవాల సమయంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉండటం నా అదృష్టమన్నారు. ఇవాళ దేశం అంతా అల్లూరి ధైర్య సాహసాలు, త్యాగం గురించి గుర్తు చేసుకుంటోందని, దేశ ప్రధాని స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో అల్లూరి 125 వ జయంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అన్నట్లు ఉంది చంద్రబాబు హడావిడి అంటూ ఆమె మండిపడ్డారు.
ఇప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తున్నాడని, తాను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ రోజూ కనీసం ఒక ఊరికి కూడా అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలన్న ఆలోచన చేయలేదని ఆమె విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అశోక్ గజపతి రాజు, అధికారం లేనప్పుడు అల్లూరి సీతారామరాజు గుర్తుకు వస్తారు చంద్రబాబుకు అంటూ ఆమె ధ్వజమెత్తారు. ప్రధానితో పాటు వేదిక పంచుకోవటానికి పవన్ కళ్యాణ్ కు ఎలాంటి అర్హత లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టి గౌరవించుకుందన్నారు.