తిరుమల శ్రీవారిని మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. శ్రీవారి కల్యాణోత్సవ సేవలో మంత్రి ఆర్కే రోజా,సెల్వమణి పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. కళ్ళు ఉన్న కబోది చంద్రబాబు నాయుడు అని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకుంటారన్న మంత్రి రోజా.. మరలా వాళ్లే రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు అని ఆరోపణ చేస్తున్నారన్నారు. ఇప్పటంకు పవన్ కళ్యాణ్ ఏం ఉద్ధరించడానికి వెళ్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అక్కడి ప్రజలకు ఆరు నెలల ముందే నోటుసులు ఇవ్వడం జరిగిందని, దానికి ప్రజలు అంగీకారం తెలిపారన్నారు.
Also Read : TTD : శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ
లాండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. అక్కడ రోడ్లు వేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి పవన్ ప్రయత్నిస్తున్నారని, మీరు ఐదు సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఏమిటో మేము ఈ మూడున్నర సంవత్సరంలో చేసిన అభివృద్ధి ఏమిటో చర్చించడానికి మేము డెబిట్ కి సిద్ధంగా ఉన్నామని ఆమె సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో అధికారులు ఇండ్లు కూల్చివేసిన బాధితులను కలిసేందుక నేడు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఇప్పటంలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే.. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రోజా పై విధంగా మాట్లాడారు.