Site icon NTV Telugu

Minister RK Roja: బాలయ్యకు రోజా కౌంటర్‌.. తొడగొట్టాడు.. తోక ముడిచాడు..!

Roja

Roja

Minister RK Roja: అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. చంద్రబాబు ప్రతీ విషయంలో ఆడవాళ్లను మోసం చేశారు.. కానీ, నాలుగున్నరేళ్లగా ప్రతీ ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచిన వ్యక్తం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించారు.. జగనన్న ఆలోచనలను కాపీ కొట్టి.. మినీ మేనిఫెస్టోను చంద్రబాబు రిలీజ్‌ చేశారని మండిపడ్డారు.. కసాయి వాడిని గొర్రెలు నమ్మొతాయేమో.. గానీ, చంద్రబాబును మాత్రం రాష్ట్ర ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు రోజా.. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు తల్లులకు పంగనామాలు అనే పథకాన్ని అమలు చేసి.. నేడు తల్లులకు వందనం పథకం అమలు చేస్తామని చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇవన్నీ మాయమాటలు తెలుసన్నారు మంత్రి రోజా..

Read Also: Tummala Nageswara Rao: 40 ఏళ్లుగా రాజకీయాల్లో నిబద్ధతతో ఉన్నా..

ఇక, అసెంబ్లీ నుంచి పారిపోయిన టీడీపీ ఎమ్మెల్యేలకు, అరెస్ట్‌ చేస్తారేమో అనుకొని ఢిల్లీలో దాక్కున్న నారా లోకేష్‌కు, రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుకు.. మొన్న ఇదే అసెంబ్లీలో తొడగొట్టి.. ఇవాళ తొకముడిచిన బాలకృష్ణకు చెబుతున్నా.. మా నాయకుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నాలుగున్నరేళ్లలో తీసుకొచ్చిన పథకాలు.. మీ నాయకుడు 14 ఏళ్లలో అమలు చేశారా? సవాల్‌ స్వీకరిస్తారా? దీనిపై చర్చకు సిద్ధమా? పసుపు జెండా పట్టుకునేవారైనా? ఎర్ర జెండా పట్టుకునేవారైనా ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తారా ? అంటూ అసెంబ్లీ వేదికగా సవాల్‌ చేశారు మంత్రి ఆర్కే రోజా..

Exit mobile version