NTV Telugu Site icon

Minister RK Roja: డేవిల్ ఈజ్ బ్యాక్.. జనసైనికుల అంతు తెలుస్తా..!

Rk Roja

Rk Roja

Minister RK Roja: అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన మంత్రి ఆర్కే రోజా.. కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉన్నారు.. అయితే, ఈ రోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. నాకు ఆరోగ్యం బాగలేదని కొంతమంది సంతోషపడుతున్నారట.. డేవిల్ ఈజ్ బ్యాక్.. జనసైనికుల అంతు తెలుస్తా..! అంటూ వ్యాఖ్యానించారు.. ఇక, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు రోజా.. ఒక రోజు సీఎం అవ్వాలని అనుకుంటున్నా అంటాడు.. మరోరోజు ఎమ్మెల్యే అవ్వాలని చెబుతారు.. అసలు ఎమ్మెల్యే కూడా కాలేనోడు ఎందుకు తిరుగుతూన్నాడో అర్థం కాదు అంటూ సెటైర్లు వేశారు. పవన్‌ కల్యాణ్‌ ఎందుకు పార్టీ పెట్టాడో అతనికే తెలియదు.. ప్రజల ఎమి చేస్తావో చెప్పకుండా జగన్, వైసీపీ నేతలపై చీప్‌గామాట్లాడుతున్నాడని ఫైర్‌ అయ్యారు.

Read Also: Nainital viral video: నైనిటాల్లో లక్షల బీర్ సీసాలు.. అమ్మి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయండి

రాజకీయాల్లో వచ్చింది సేవ చేయడానికా? లేక అధికార పార్టీ నేతలను కొట్టడానికా? అని ప్రశ్నించారు మంత్రి రోజా.. అమ్మవారి పేరు వాహనానికి పెట్టుకుని బూతుపురాణం చేబుతున్నాడు.. ప్రజలు దృష్టిలో పవన్‌ విలన్‌గా మారుతున్నాడని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే పవన్ బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు.. ఇప్పటికైన చిరంజీవి చెప్పిన మాట పవన్ వింటే మంచిదని హితవుపలికారు.. మీరు గుంపులుగా వచ్చినా.. విడివిడిగా వచ్చినా 2024లో గెలిచేది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే.. జగనే సీఎం రాసిపెట్టుకో అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి ఆర్కే రోజా.

Show comments