Site icon NTV Telugu

Minister RK Roja: లోకేష్ ఒక బఫూన్… ఒక ఐరన్ లెగ్ అంకుల్

Roja1

Roja1

లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు మంత్రి ఆర్ కె రోజా. పుత్తూరులో జనం లేక కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి జనాన్ని తరలించారు. నా నియోజకవర్గం వారు లోకేష్ ని కొట్టటానికి రెడీ అయ్యారు…కానీ నేనే కొట్టద్దని అడ్డుకున్నాను…నేను జబర్దస్త్ ఆంటీ అయితే మీ అమ్మ హెరిటేజ్ ఆంటీ అనాలా.. నీ భార్యను హెరిటేజ్ పాప అనాలా అని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. దాదాపు ముప్పై ఏళ్ళు నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్నాను…నీది అవినీతి సొమ్మా…నాది అవినీతి సొమ్మా అనేది సీబీఐ ఎంక్వరీ కి సిద్ధమా అని సవాల్ చేశారు.

మీ నాన్న పొలంలో ఎర్రదుంగలు ఎలా వచ్చాయి అనేది ఇంక తేలలేదు. జగన్ కి నీకు చాలా తేడా ఉంది…జగన్ పులి అయితే నువ్వు పులకేశి…జగన్ జెండా అజెండా తో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు…జగన్ కి తన నియోజకవర్గం లో ఇల్లు ఉంది..విజయవాడ ఇంట్లో ఉండి ప్రజా సమస్యలు తీరుస్తున్నాడు. నువ్వు మీ నాన్న దొంగల్లా వచ్చి పోతున్నారు…నిజంగా జగన్ నీముందుకు వస్తే గుండె ఆగి చస్తావ్…టెంట్లల్లో దాక్కుని సాయంత్రం వాక్ చేస్తున్నావ్ నువ్వు…పాదయాత్ర సక్రమంగా చేయలేక నువ్వు కూడా జగన్ ని విమర్శిస్తున్నావ్…ఇలానే విమర్శిస్తే నీకు బడితపూజ తప్పదన్నారు.

Read Also: Mallu Ravi: వెంకటరెడ్డి వ్యాఖ్యలపై ఫైర్.. చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి లేఖ రాస్తాం

నేను మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నాను…ఇంకో సారి ఆరోపణలు చేస్తే ఆడోళ్లతో కొట్టిస్తాను…జగన్ని అన్న వారు ఎవరు కూడా బాగుపడిన చరిత్ర లేదు…స్టాంఫర్డ్ యూనివర్సిటీ కీ ఫీజు ఎవరు కట్టారు…? 2004 నుంచి రెండు సార్లు ఓడిపోయాను…కడుపు నొప్పితో నా మీద ఆరోపణలు చేస్తున్నారు…గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని…ఇప్పుడు నేను చేసిన అభివృద్ధి పై చర్చకు సిద్ధమా అన్నారు. తారక్ పడిపోతే దండలు వేసుకుంటూ ముందుకెళ్లాడు..కానీ మనిషి పడిపోతే కనీసం పట్టించుకోలేదు…మీ అమ్మను మీ నాన్నకు ఇచ్చి పెళ్లి చేస్తే..చేసిన పెద్దాయననే పైకి పంపించిన వారు మీరు…పాదయాత్రలో ఎంత మంది పోలీసులు, ఎంతమంది వాలంటీర్లు, .ఎంతమంది పాదయాత్రలో నడుస్తున్నారో అందరికీ తెలుసు…

వాళ్ళ నాన్నకే తెలుసు మళ్లీ తెలుగుదేశం రాదని..అందుకే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసింది…లోకేష్ అనేవాడు రాజకీయంగా పనికిరాడు..లోకేష్ ఒక బఫూన్… లోకేష్ ఒక ఐరన్ లెగ్…పాదయాత్ర స్టార్ట్ చేస్తే చెట్టంత వ్యక్తి పడిపోయి హాస్పెటల్ లో ఉన్నాడన్నారు మంత్రి రోజా.

Read Also: Sachin Tendulkar: సూర్యకుమార్‌లా అమ్మాయి బ్యాటింగ్..సచిన్, జైషా ప్రశంసలు

Exit mobile version