NTV Telugu Site icon

Ministe RK Roja: ఇంత బడ్జెట్‌తో ఏ ప్రభుత్వం ఇప్పటివరకూ క్రీడలు నిర్వహించలేదు..

Minister Rk Roja

Minister Rk Roja

Ministe RK Roja: ఇంత బడ్జెట్‌తో ఏ ప్రభుత్వం ఇప్పటివరకూ క్రీడలు నిర్వహించలేదని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వంద కోట్ల బడ్జెట్‌ క్రీడలకు కేటాయించారన్నారు. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త క్రీడా టోర్నమెంట్ల వీడియో లాంఛ్ ,బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో కలిసి రోజా పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్రాలో మ్యాచ్‌లు ఆడే‌వారిలో విజేతలకు 12 కోట్ల వరకూ బహుమతులున్నాయన్నారు. ఆడుదాం ఆంధ్ర ట్రైలర్ సక్సెస్ ఫుల్‌గా జరిగిందని.. 7 లక్షల మంది 72 గంటల్లో రిజిస్టర్ చేసుకున్నారన్నారు. సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.

Read Also: Pawan Kalyan: టీడీపీ వెనుక జనసేన వెళ్లటం లేదు..

హైదరాబాద్‌లో ఓటు పెట్టుకుని ఇక్కడ ఆడతాం అంటే కుదరదని మంత్రి పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో దొంగలా పారిపోయి వచ్చిన చంద్రబాబును ఎవరూ అడగగలరని ఆమె విమర్శించారు. పర్మనెంట్ ఉద్యోగాలు గతంలో ఎప్పుడూ లేవని.. అకాడమీలు కట్టడం కోసమే కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధులకు ల్యాండ్ ఇచ్చామన్నారు. సాకేత్‌కు కూడా ల్యాండ్ ఇస్తామని మంత్రి తెలిపారు. ఆడుదాం ఆంధ్రాలో గెలిచిన వారికి ఏం చేయాలో స్పోర్ట్స్ కోటా విషయమై ఆలోచిస్తామన్నారు. వాలంటీర్లతో పాటు పీటీలు కూడా ఉంటారని ఆమె చెప్పారు. సచివాలయం, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. 50రోజుల పాటు ఈ క్రీడలు జరగనున్నాయని వెల్లడించారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఆడపిల్లలు క్రీడాల్లో రాణించాలని సూచించారు. ఆన్‌లైన్‌, సచివాలయాల్లో ఈ క్రీడాల్లో పాల్గొనే వాళ్లు నమోదు చేసుకోవాలని మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు.

Read Also: KRMB: ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ.. వెంటనే నీరు తీసుకోవడం ఆపండి..

కొవిడ్ తరువాత వైసీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసిందని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంటి తలుపు ప్రభుత్వం తడుతోందన్నారు. 2400 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. పాత ప్రభుత్వం నుంచీ ఇప్పటి వరకూ ఉన్న బకాయిలు అన్నీ తీర్చడం జరిగిందన్నారు. కోటి మంది వరకూ రిజిష్టర్ అవుతారని మా అంచనా అని.. వాలంటీర్లు ఆటలకు రిఫరీలుగా ఉంటారన్నారు. గ్రామ స్థాయి నుంచీ రాష్ట్ర స్ధాయి వరకూ పోటీలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. గెలిచిన వారికి బహుమతులతో పాటు స్పోర్ట్స్ కిట్స్ ఇస్తామన్నారు. క్రికెట్‌లో బాగా ఆడిన వారికి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ద్వారా కోచింగ్ ఇప్పిస్తామన్నారు. కృష్ణ జింకను ఈ ఆటలకు గుర్తుగా పెట్టి, దానికి కిట్టు అని పేరు పెట్టామని చెప్పారు. 24 మంది అంతర్జాతీయ క్రీడాకారులను బ్రాండ్ అంబాసడర్‌లుగా పెట్టామని స్పష్టం చేశారు.