NTV Telugu Site icon

Minister RK Roja: పవన్‌కు మాస్‌ వార్నింగ్‌.. వెంట్రుక కూడా పీకలేవు..!

Minister Rk Roja

Minister Rk Roja

Minister RK Roja: ఇరిటేషన్‌ స్టార్ రెండు రోజులుగా వాలంటీర్లని, సీఎంను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. సీఎం వైఎస్‌ జగన్‌ అంటే వణుకు అనుకున్నా.. జగన్ తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ అన్నా వణుకే అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి ఆర్కే రోజా.. కానీ, వాలంటీర్ వ్యవస్థ వెంట్రుక కూడా పికలేవు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 2024లో ఓడిపోతామని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అర్ధం అయ్యింది.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ పవన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.. పవన్ వాలంటీర్ల కళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలి.. లేదంటే వాళ్లే పవన్ సంగతి తెలుస్తారు అంటూ వార్నింగ్‌ ఇచ్చారు రోజా.

Read Also: Pooja Ramachandran : స్విమ్ షూట్ లో తడి అందాలతో హాట్ ట్రీట్..తల్లైనా తగ్గట్లేదుగా..

మహిళల అక్రమ రవాణా వాలంటీర్ల వల్లే జరుగుతుంది అని పవన్‌ మాట్లాడటం సిగ్గు చేటు అని ఫైర్‌ అయ్యారు మంత్రి రోజా.. పవన్ కళ్యాణ్ కి సమాచారం ఇచ్చిన కేంద్ర నిఘా వర్గాలు ఎవరు? వార్డ్ మెంబర్ గా కూడా గెలవని నీకు సమాచారం ఎవరు ఇచ్చారు..? అంటూ దుయ్యబట్టారు. మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ 6 స్థానంలో ఉంది.. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే దమ్ము ఉందా? మాట్లాడితే హైదరాబాద్ లో వుండలేవు అంటూ కామెంట్ చేశారు. ఇక, నందమూరి బాలకృష్ణ.. జనసేన వాళ్లను అలగా జనం అన్నారు.. అదే బాలకృష్ణ ఇంటర్వ్యూకి పిలిస్తే ఎలా వెళ్లావు? అని ప్రశ్నించారు.

Read Also: BANW VS INDW: టీమిండియా బ్యాటర్లకు నరకం చూపించిన బంగ్లా బౌలర్లు.. చివరికి ఇండియాదే సిరీస్..!

ఇక, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యుల పేరు ఎత్తి మాట్లాడారా? అని ప్రశ్నించారు రోజా.. సాక్షాత్తు ముస్సోరి IAS సిలబస్ లో వాలంటీర్‌ వ్యవస్థ గురించి పెట్టారు అని గుర్తు చేశారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ సచివాలయానికి అయినా వెళ్దాం.. నేను గెలిచిన నగరి అయినా, భీమవరం, గాజువాక అయినా.. వాలంటీర్ల పని తీరు గురించి అక్క చెల్లెమ్మలను అడుగుదాం అంటూ సవాల్‌ చేశారు. పవన్ కళ్యాణ్ కి 55 సంవత్సరాలు వచ్చినా కనీసం ఎంపీటీసీ కూడా కాలేదు. కానీ, సీఎంని ఏక వచనంతో మాట్లాడతా అంటున్నారు.. మీ తల్లి నేర్పిన సంస్కారం ఇదా? అంటూ మండిపడ్డారు.. ఇదే సమయంలో అమ్మ మిమ్మల్ని అన్నందుకు క్షమించండన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటేనే క్రియేటర్ అంటున్నారు.. వాలంటీర్ల గురించి మాట్లాడితే పళ్లు రాలగొడ్తారు అంటూ హెచ్చరించారు మంత్రి ఆర్కే రోజా.

Show comments