Site icon NTV Telugu

Minister Roja: చంద్రబాబుది అక్రమ కేసు కాదు.. అడ్డంగా దొరికిపోయిన కేసు

Roja

Roja

ఏపీ పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజా నేడు తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తప్పు చేసిన చంద్రబాబుకి శిక్షపడాలని అందరూ కోరుకున్నారు అని అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకి శిక్షపడడంతో మ్రొక్కులు చెల్లించుకున్నాను అని ఆమె పేర్కొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ లో చంద్రబాబుకి పూర్తిస్థాయిలో భధ్రతా ఏర్పాట్లు కల్పించామని మంత్రి రోజా అన్నారు.

Read Also: Vizianagaram: విజయనగరంలో విషాదం.. బావిలో శవాలై తేలిన కుటుంబం

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గగ్గోలు పెడుతున్న తీరు చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అని మంత్రి రోజా అన్నారు. చంద్రబాబుది అక్రమ కేసు కాదు…అడ్డంగా దోరికిపోయిన కేసు.. స్కీల్ డెవల్పెంట్ కేసులో లోపలికి వెళ్ళిన చంద్రబాబు.. ఇక లోపలే వుంటాడు అంటూ ఆమె ఆరోపించారు. లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణలు కూడా లోపలికి వెళ్ళడానికి సిద్దమవ్వాలి అని రోజా విమర్శించింది.

Read Also: Free Ration: రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా బియ్యం, గోధుమలతో పాటు పంచదార

నిన్న ( సోమవారం ) తెలుగు దేశం పార్టీ బంద్ కి పిలుపునిస్తే.. చంద్రబాబు భార్య భువనేశ్వరి, లోకేష్ భార్య బ్రహ్మణి పట్టించుకోకూండా హెరిటేజ్ ని ఓపెన్ చేసారు అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసే కాదు.. వరుసగా అమరావతి భూములు కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, పట్టిసీమ కేసు, పోలవరం కేసులు సాక్ష్యాధారాలతో సహ వెలుగులోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు. ఇన్ని రోజులు చంద్రబాబు చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవించకతప్పదని అన్నారు. కోర్టులను మెనేజ్ చేసుకుంటు చంద్రబాబు పబ్బం గడిపాడంటూ రోజా విమర్శలు గుప్పించింది.

Exit mobile version