Site icon NTV Telugu

Minister RK Roja: డేటా చౌర్యం టీడీపీ దుష్టపన్నాగం

Roja1 (2)

Roja1 (2)

టీడీపీ నేతలకు దేనిమీద పోరాడాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు మంత్రి ఆర్కే రోజా. పిచ్చి పట్టినోళ్లలాగా వ్యవహరిస్తున్నారు. ప్రజాసాధికారత సర్వే ద్వారా డేటా సేకరించి దుష్ట పన్నాగం పన్నారు. ఈ డేటా బాబా డేరా బాబా కంటే పెద్ద దొంగ. 30 లక్షల మంది డేటాను చోరీ చేశారు. డేటా చౌర్యంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నా. ప్రతిపక్షనేతల ఫోన్లను ట్యాప్ చేయించారు. 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. లోకేష్ కు బాడీతో పాటు మైండ్ లో గుజ్జు కూడా కరిగిపోయింది. నిజంగా ఎన్టీఆర్ పైన చంద్రబాబుకు ప్రేమ ఉంటే సీఎంగా సంతకం పెట్టిన మొదటి రోజే అన్నా క్యాంటీన్ పెట్టుండేవాడన్నారు.

Read Also: Food Poisoning: గురుకులంలో మళ్లీ ఫుడ్ పాయిజన్.. 45 మంది విద్యార్థులకు అస్వస్థత

టీడీపీ ఇచ్చిన దానికంటే ఎక్కువగా పెళ్లి కానుక ఇస్తున్నాం. 200 యూనివర్శిటీల్లో విద్యాకానుకను అమలు చేస్తున్నాం. చంద్రబాబుకు సిగ్గుందా…ఏనాడైనా అమ్మఒడి గురించి ఆలోచన చేశాడా? ప్రజలను అభిమానిస్తాడు కాబట్టే జగన్ అమ్మఒడి తీసుకొచ్చారు.. టీడీపీ నేతలందరినీ మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని జనం ఎదురు చూస్తున్నారు… డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలను ఎగరకొట్టిన దౌర్భాగ్యుడు చంద్రబాబు. అక్కచెల్లెమ్మలు బాగుండాలనే జగన్ ఆసరా పధకం పెట్టారు. టీడీపీ నేతలు కళ్లుండి చూడలేని వెధవలు.. ఏనాడైనా మంచి పథకం పెట్టాలన్న ఆలోచనైనా చంద్రబాబు చేశాడా? అని రోజా ప్రశ్నించారు.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి టీడీపీ పార్టీకి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. చినరాజప్ప హోంమంత్రిగా ఉన్నప్పుడు హోంకే పరిమితం అయ్యాడు. దేశమంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారు. మేం అందిస్తున్న పథకాలన్నీ సంక్షేమం కాదా? బీసీ, ఎస్సీ,ఎస్టీ ,మైనార్టీలకు పెద్ద మొత్తంలో సంక్షేమం అందించిన వ్యక్తి సీఎం జగన్. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదు..పిచ్చి పిచ్చి వేషాలేస్తే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నా అన్నారు మంత్రి రోజా. నన్ను తిట్టే జనసేన పార్టీ నాయకులు నగిరిలోని నా ఇంటికొచ్చి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ విలువలు లేని వ్యక్తి అని.. ఏ ఎన్నికల్లో ఎవరికి ఓటేయమని చెబుతాడో తెలియదు. షూటింగ్ లు లేని సమయంలో ప్యాకేజ్ తీసుకుని ప్రెస్ మీట్లు పెట్టడమే పవన్ పని. మమ్మల్ని తిడితే ఆకాశం మీద ఉమ్మినట్లే అన్నారు రోజా.

Read Also: Satyavathi Rathod: మంత్రి సత్యవతికి షాక్.. కాళ్ళు పట్టుకొని టీఆర్ఎస్ నేతల నిరసన

Exit mobile version