పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలిలో గోదావరి ఏటిగట్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. “జగన్ ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను విధ్వంసం చేసి, కనీస మెయింటెన్స్ పనులు కూడా పట్టించుకోకపోవడంతో ఏటిగట్లు బలహీనపడి ప్రమాదంగా మారాయి. రాష్ట్రంలో ఇరిగేషన్ అత్యవసర పనులు నిమిత్తం చంద్రబాబు మంజూరు చేసిన రూ. 320 కోట్ల నిధుల పనులను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలి. జగన్ పాలనలో గోదావరి ఏటిగట్లకు ఒక్క రూపాయి ఖర్చు చేయకపోవడంతో వరదలు వస్తే ప్రజలు, యువకులు కలిసి రాత్రుళ్ళు సైతం పనిచేసి ఏటిగట్లను కాపాడుకున్నారు.” అని మంత్రి తెలిపారు.
READ MORE: Sumanth : నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సుమంత్ ‘‘అనగనగా’’
జగన్ నిర్లక్ష్యం చేసిన ఏటిగట్లను బలోపేతం చేయడం, డ్రైన్ల పూడిక పనులు, గేట్లు, షట్టర్లు, లాకులు, రోప్ లు వంటి అత్యవసర పనులను సరిచేస్తున్నామని మంత్రి రామానాయుడు తెలిపారు. నాడు ఇరిగేషన్ శాఖలో 12 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్‌లకు ఆమోదముద్ర వేస్తూ ఉద్యోగుల గౌరవాన్ని కాపాడుతున్నామన్నారు. గత ప్రభుత్వం రాజకీయ ప్రేరేపితంగా 386 మంది ఇరిగేషన్ ఉద్యోగులపై విజిలెన్స్ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతుంటే, వాటి నుంచి ఉద్యోగులను విముక్తులు చేశామని చెప్పారు.
READ MORE: Vijayawada: వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రౌండ్ టేబుల్ సమావేశం.. వైసీపీ నేత హాజరు..