Site icon NTV Telugu

Ponguleti Srinivas Reddy : వనజీవి రామయ్య మృతి చాలా దురదృష్టకరం, బాధాకరం

Ponguletisrinivasareddy

Ponguletisrinivasareddy

Ponguleti Srinivas Reddy : పద్మశ్రీ గ్రహీత, పర్యావరణ పరిరక్షకుడు వనజీవి రామయ్య మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో మాట్లాడుతూ మంత్రి ఆయన మృతిని “చాలా దురదృష్టకరమైనది, బాధాకరమైనది” అన్నారు.

“పద్మశ్రీ వనజీవి రామయ్య మనకు కనిపించనంతగా దూరమయ్యారు. ఇది మనం తట్టుకోలేని నష్టం,” అని మంత్రి అన్నారు. ప్రభుత్వ పక్షాన, తన వ్యక్తిగత పక్షాన రామయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

“ఒక మనిషి జీవించినంత కాలం ఏమి సాధించాడన్నది చాలా ముఖ్యమైన అంశం. రామయ్య గారు తన జీవితాన్ని ప్రకృతి పరిరక్షణకు అంకితంగా వెచ్చించారు. ఆర్థికంగా ఒడిదుడుకుల మధ్య కూడా కోటి మొక్కలకు పైగా నాటి, వాటిని పెంచిన ఘనత ఆయనకు చెందుతుంది,” అని మంత్రి పొంగులేటి వివరించారు.

రామయ్య మొక్కలను ఎలా నాటి, వాటి లాభాలను ప్రజలకు ఎలా తెలియజేయాలో చెబుతూ గ్రామాలు, పట్టణాలు పర్యటించి తన ఆశయాలను వ్యాప్తి చేశారు. పర్యావరణంపై ప్రజలలో చైతన్యం తీసుకురావడంలో ఆయన పాత్ర అమోఘమని మంత్రి కొనియాడారు.

రామయ్యకు చిరకాలంగా కొన్ని కోరికలు ఉన్నాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారని మంత్రి చెప్పారు. “వాటన్నింటినీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించి, వాటిని నెరవేర్చే దిశగా ప్రభుత్వంగా చర్యలు తీసుకుంటాము,” అని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, రామయ్య అభిమానులు, పర్యావరణ ఉద్యమ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనకు నివాళులు అర్పించారు.

SRH vs PBKS: అభిషేక్ శర్మ స్లిప్ సెలబ్రేషన్.. రాసుకొచ్చి మరి విధ్వంసం.. పంజాబ్ పై సన్‌రైజర్స్ ఘన విజయం

Exit mobile version