రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల జారీ పై సమావేశంలో చర్చించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నేడు అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎక్కడా ఆందోళన చేయాల్సిన అవసర లేదని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధి దారులకు అందరికీ రేషన్ కార్డులు అందుతాయని హామీ ఇచ్చారు. “గత పదేళ్లుగా రేషన్ కార్డులు విడుదల కాలేదు.. పెళ్ళైన మహిళలు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్లిన వాళ్లకు పేర్లు మార్చునే అవకాశం కూడా ఉంటుంది.. ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ అవకాశం వినియోగించుకోవాలి.. ఫీల్డ్ వెరిఫికేషన్ తరువాత వచ్చిన రిపోర్ట్ ఆధారంగా గ్రామసభల్లో వెళ్లడిస్తాం.. అనర్హులకు ఎవరికైనా ఉన్నట్లు మీ దృష్టికి వస్తే ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పై అవసరమైన కసరత్తు చేస్తున్నాము..” అని మంత్రి వెల్లడించారు.
READ MORE: Cock Fights: రేపు ప్రారంభం కానున్న కోడి పందాలు.. పశ్చిమగోదావరి జిల్లాలో భారీ ఏర్పాట్లు!
స్థలాలు లేని వారికి ఏ విధంగా ఇవ్వాలనే అంశాన్ని కూడా చర్చిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. “ముఖ్యమంత్రి సహకారంతో అందరికీ అందేలా ఏర్పాటు చేస్తాం.. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ను ప్రియారిటీ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది.. ప్రజలు కూడా సహకరించాలి.. హైదరాబాద్ జిల్లా రాష్ట్రానికి మార్గధర్శకంగా నిలవాలని కోరుతున్నా.. ఇందుకు అందరూ ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు సహకరించాలి.. ప్రభుత్వానికి ప్రజల సహకారం అవసరం.. గతంలో కూడా ప్రజల సహకారం ఉన్న పథకాలే సక్సెస్ అయ్యాయి.. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం లను కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పంపిణీ చేస్తాం.. గత ప్రభుత్వం నిర్లక్షం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. అయినా కూడా మేము ప్రకటించిన పధకాలు నెరవేరుస్తున్నాం..” అని మంత్రి వ్యాఖ్యానించారు.