సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతో ముచ్చటించారు. పలు ప్రజా సమస్యలను వినతులను మంత్రికి అందజేసిన పట్టణ ప్రజలు.. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. తన దృష్టికి వచ్చిన పలు అంశాలపై వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపించారు. హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న రోడ్డు వైండింగ్, నాలాల నిర్మాణాలను పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.
Read Also: Nikhil Gupta : ఉగ్రవాది పన్ను హత్య కేసు.. నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించిన చెక్ రిపబ్లిక్
ఇక, స్థానిక ప్రజలతో మాట్లాడుతూ నాళాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఇంటి ముందు కూల్చేసిన ప్రాంతాల్లో త్వరగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. షాపుల యజమానులతో, చిరు వ్యాపారులతో ముచ్చటించారు. పట్టణంలోని విజయ పాల ఉత్పత్తిదారుల సహాయ సహకార సంఘం సందర్శన.. రోజు వస్తున్న పాలు ఎన్ని లీటర్లు, ప్రజలు ఇళ్లలోకి తీసుకు వెళ్తున్న పాలు ఎన్ని లీటర్లు ఎన్ని వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు.