పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బతుకులు మారతాయి అనుకున్నాం.. కానీ, 10 ఏళ్ళు గడచిన ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉండి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గడచిన 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగులతో పాటు సకల జనుల బ్రతుకులు మరలేదు.. రాష్ట్ర ప్రజలు మార్పు కావాలన్నారు తెచుకున్నారు.. 31 రోజుల్లోనే హామీల అమలు దిశగా ముందుకు వెళ్తుంన్నాం.. నిత్యం ప్రజాల్లోనే ఉండాలనే సంకల్పం తో వెళ్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఆ కుటుంబానికి తప్ప ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు.. ఆయన గారి కాలంలో ఏ మంత్రికి స్వేచ్ఛ లేదు.. మా మా శాఖల్లో పూర్తి స్వేచ్ఛ ఉంది.. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
Read Also: Saindhav: చివరి 20 నిముషాలు… ముందెప్పుడూ చూసి ఉండరు
ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూడా మాకు మనస్సుంది మార్గం దొరుకుతుంది అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఆరు నూరైనా ఖచ్చితంగా అమలు చేస్తాం.. మేం నాయకులం కాదు సేవకులం.. రెండు పర్యాయాలు నిరుద్యోగులు వేదనకు గురయ్యారు అంటూ కన్నీటి పర్యంతమైన మంత్రి పొంగులేటి.. ఈ సందర్భంగా ఉద్వేగంతో మంత్రి మాట్లాడారు. పుట్టుకతో ఏ ఒక్కరూ కోటీశ్వరుడు కాదు అంటూ ఎంతో మనో వేదనకు గురయ్యారు.. ఆ రోజు నేను కన్నీరు పెడితే కార్యకర్తలు నిరాశ పడతారని నేను కన్నీరు చెమ్మగిళ్ళనివ్వలేదు.. ఇక్కడున్న ఇదే అధికారులు ఎంతో ఇబ్బంది, కేసులు పెట్టారు.. నన్ను పెట్టిన బాధలకు నా కృషికి, పట్టుదలకు ఈ ఫలితం దక్కింది.. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నూటికి నూరు శాతం అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.