ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించినట్లు మెడికల్ కళాశాల భూముల కొనుగోలులో నేను ఒక్క రూపాయి తీసుకున్నట్లు రుజువు చేస్తే పోటీ నుంచి విరమించుకుంటాను.. అలాగే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. మున్సిపల్ బిల్డింగ్స్ నిర్మాణం టెండర్స్ పిలిచి నిర్మిస్తారు.. కార్యకర్తలకు ఇవ్వడం కుదరదని చంద్రబాబు ఆరోపణలను మంత్రి ఖండించారు. చౌకబారు ఆరోపణలు చేయ్యడం చంద్రబాబుకు అలవాటే అని ఆయన తెలిపారు. నేను చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత విమర్శలు ఎపుడూ చేయ్యలేదు.. ముఖ్యమంత్రి జగన్ ను దుర్మార్గుడు అని సంబోధించడం తగదు.. సిద్ధాంత పరంగా విమర్శించుకోవాలి.. కానీ వ్యక్తిగత విమర్శలు మంచిది కాదని మంత్రి విశ్వరూప్ చెప్పుకొచ్చారు.
Read Also: YV Subba Reddy: వాళ్లకు వైసీపీ చేసిన అభివృద్ధి కనిపించడం లేదా.. ?
కోనసీమ అల్లర్లలో ఉన్న వారు ఇపుడు ఏ పార్టీలో ఉన్నారో చూసుకోవాలి అని మంత్రి విశ్వరూప్ తెలిపారు. నా ఇల్లు తగలబెట్టినా నేను ఎవరిపైనా ఆరోపణలు చెయ్యలేదు.. పోలీసులు దర్యాప్తు చేశారు.. విశ్వరూప్ మంచి వైరస్ వంటి వాడు కోనసీమకు మంచి చేశాను కానీ అపకారం చెయ్యలేదన్నారు. అమలాపురంలో పార్టీల మధ్య కంటే విశ్వరూప్ క్యారెక్టర్ కు ఆనందరావుకు మధ్య పోరాటం జరుగుతుందన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం ఇప్పటికైనా టీడీపీ నేతలు మానుకోవాలి.. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు.