Site icon NTV Telugu

Minister Peddireddy Ramachandra Reddy: ఎన్విరాన్మెంట్ మేనేజ్‌మెంట్ యాప్స్ లాంఛ్ చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy

Peddireddy

Minister Peddireddy Ramachandra Reddy: ఎన్విరాన్మెంట్ మేనేజ్ మెంట్ యాప్స్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ చేతుల మీదుగా లాంఛ్‌ చేశారు. నాలుగు ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ యాప్స్‌ను మంత్రి ఆవిష్కరించారు. 2019లో ఎన్విరాన్మెంట్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్‌ను పూర్తిగా కంప్యూటరైజ్డ్ చేశామని మంత్రి వెల్లడించారు.

Read Also: GVL Narasimha Rao: అయోధ్యలో ఆలయ నిర్మాణం 550 ఏళ్ల కల.. జనవరి 22 చరిత్రలో నిలిచిపోతుంది..

కొన్ని యాప్స్ రూపొందించామన్న ఆయన.. వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మంచి ఫలితాలుంటాయని చెప్పారు. మెరైన్ డిశ్ఛార్జ్ సిస్టంను చక్కగా డెవలప్ చేశారని.. ఎయిర్ పొల్యూషన్ కట్టడికి చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. మరో మూడు నెలల్లో చిమ్నీలను తనిఖీ చేసేందుకు కొత్త విధానాన్ని తెస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Exit mobile version