NTV Telugu Site icon

Minister Peddireddy: చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్

Minister Peddireddy Ramachandra Reddy

Minister Peddireddy Ramachandra Reddy

Minister Peddireddy Ramachandra Reddy: చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. తనపై చంద్రబాబు మితిమీరి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. “నన్ను పాపాల పెద్దిరెడ్డి అంటావా ?. నీ లాగా మామకు వెన్నుపోటు పొడిచానా ?. చంద్రబాబు నువ్వు అధికారంలోకి రావు. కనీసం కుప్పంలో కూడా గెలవలేవు. కుప్పంకు మేము నీరు ఇస్తున్నాం… 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏమి చేశావ్. రాజకీయంగా చూసుకోలేక చౌకబారు విమర్శలకు దిగారు. ఓటమి భయంతో చంద్రబాబు మాటలు మాట్లాడుతున్నారు.” అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందని చంద్రబాబు విమర్శించారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు బాబు షూరిటీ భవిషత్తు గ్యారంటీ అంటున్నారని విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్టీఆర్‌ను గద్దె దింపగానే మద్యపాన నిషేదం ఎత్తివేశారని, రెండు రూపాయల కిలో బియ్యం తీసేశారని పేర్కొన్నారు. 2014లో ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలు తొలగించారని చెప్పారు.

Read Also: Supreme Court: సుప్రీంకోర్టు వజ్రోత్సవాలు ప్రారంభం.. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ ఫార్మాట్‌

ఇన్నిసార్లు మోసం చేసిన చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మరన్నారు. సీఎం వైఎస్ జగన్ పార్టీలు కూడా చూడకుండా పథకాలు అందిస్తున్నారన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు పెట్టి టీడీపీకి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చారని ఆరోపించారు. పేదరికాన్ని కొలబద్దగా తీసుకుని ప్రజలకు అండగా నిలిచింది సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పథకాలు అమలుపై సీఎం వైఎస్ జగన్ దృష్టి సారించారన్నారు. చంద్రబాబు సిగ్గు ఎగ్గు లేకుండా తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకు నీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. మేము ఈరోజు కుప్పంకి నీరు అందిస్తున్నామన్నారు. తాను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసన్నారు. కుప్పంలో 14 వేల ఇళ్లు కట్టించామన్నారు.చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు బుద్ధి చెపుతారన్నారు. చంద్రబాబు మోసకారి మాటలు నమ్మొద్దు.. అధికారంలోకి రాలేము అని దూషణలు మొదలు పెట్టారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి చేశాం అని చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో అధికారంలోకి రావు, కుప్పంతో సహా చిత్తూరులో ఎక్కడా గెలవవని పేర్కొన్నారు. ఇలాంటి చౌకబారు మాటలు కొనసాగిస్తే ప్రజలే రాళ్లతో కొడతారన్నారు.