Site icon NTV Telugu

Peddireddy Ramachandra Reddy: టీడీపీకి అభ్యర్థులు దొరక్క కష్టపడి జాబితా విడుదల..! 150కి పైగా స్థానాల్లో వైసీపీ విజయం

Peddireddy

Peddireddy

Peddireddy Ramachandra Reddy: టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ విడుదల చేసిన విషయం విదితమే.. 24 ఎమ్మెల్యే స్థానాల్లో, మూడు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని.. మిగతా స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు. ఇక, తొలి జాబితాలో భాగంగా టీడీపీ 94 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు. జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ వెల్లడించారు.. ఇక, జనసేన ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.. మిగతా స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు.. అయితే, టీడీపీ-జనసేన తొలి జాబితాపై సెటైర్లు వేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..

Read Also: Viral Video: ఢిల్లీ మెట్రోలో మరోసారి రెచ్చిపోయిన యువతులు.. చూసేవారికి భలే టైమ్ పాస్

సీఎం వైఎస్‌ జగన్‌ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా మొదలు పెట్టారు.. కానీ, టీడీపీకి ఇంకా పొత్తులు విషయంలో కూడా క్లారిటీ లేదు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి పెద్దిరెడ్డి.. నేడు టీడీపీ విడుదల చేసిన జాబితా చూస్తే.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి అని అర్థమవుతుందన్నారు. అభ్యర్థులు దొరక్క కష్టపడి టీడీపీ జాబితా విడుదల చేసినట్టు కనిపిస్తుందంటూ సెటైర్లు వేశారు. ఇక, చిత్తూరు జిల్లాలో కుప్పంతో సహా అన్ని సీట్లు గెలుస్తాం.. రాయలసీమలో దాదాపుగా అన్ని సీట్లు గెలుస్తాం అనే ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Exit mobile version