శ్రీకృష్ణదేవరాయలు అంటే ఒక బలిజ కులానికి చెందిన వ్యక్తి కాదు అందరివాడు అన్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నమయ్య జిల్లా మదనపల్లి బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయుల విగ్రహా విష్కరణకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. శ్రీకృష్ణదేవరాయలు అంటే ఒక బలిజ కులానికి చెందిన వ్యక్తి కాదు. కృష్ణ జిల్లా అవనిగడ్డ లో అయన మూడు రోజులు ఉన్నట్టు ఆయన శిలాశాసనం ఉంది. అయన అనేక ప్రాంతాలను సందర్శించారు.
Read Also:Vidadala Rajini: చింతమనేనికి మహిళలంటే గౌరవం లేదు
అయన అన్ని ప్రాంతాలను, అందరినీ సమానంగా చూసారు. మంచి పాలన అందించారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ద్వారా కావలసిన వారికి మాత్రమే పథకాలు అందించారు. ఈరోజు మదనపల్లి లో శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహా ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉంది. కుప్పం, పలమనేరు లో కూడా నేనే విగ్రహా ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. నా రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుండి బలిజ సోదరులు అండగా నిలిచారు. వారికి వీలైనంత సేవ చేసేందుకు కృషి చేస్తానని మంత్రి పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా మా మద్దతు ఉంటుందన్నారు మంత్రి.
Read Also: Matrimonial Fraud : తెల్లపిల్ల అనుకున్నాడు.. రూ.35లక్షలు ఇచ్చి తెల్లముఖం వేశాడు