NTV Telugu Site icon

Minister Niranjan Reddy: అన్నం పెట్టే అన్నదాతకు ఆసరాగా నిలవాలన్నదే కేసీఆర్ తపన

Niranjana Reddy

Niranjana Reddy

తెలంగాణలో రైతుల కళ్లలో సీఎం కేసీఆర్ సంతోషం చూస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు సంపూర్ణం అయిందని ఆయన పేర్కొన్నారు. 11వ విడతలో రూ.7624.74 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేయబడ్డాయని తెలిపారు. 68.99 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాలకు పంపిణీ చేశామన్నారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 5 లక్షల 8756 మంది రైతులకు రూ.609.67 కోట్లు వారి అకౌంట్లో పడినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Read Also: Whats app: ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన వాట్సాప్

అత్యల్పం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35,879 మంది రైతులకు రూ.33.60 కోట్లు రైతుల అకౌంట్లో జమ చేసినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో రైతును రాజును చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు.. ఎన్ని ఇబ్బందులున్న ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తిచేస్తున్నామన్నారు. రైతుబంధు మొదలు పెట్టినప్పుడు ఎన్నికల కోసం అని విమర్శించారు.. 11వ విడత రైతుబంధు విజయవంతంగా పూర్తిచేసుకున్నామని మంత్రి అన్నారు.

Read Also: Chandrayaan 3 Live Updates: చంద్రయాన్ -3 ల్యాండింగ్ పై ఉత్కంఠ

మొత్తం ఇప్పటి వరకు రూ.72,815.09 కోట్లు నేరుగా రైతుల ఖాతాలలోకి జమ చేసినట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. స్వంతంత్ర భారత చరిత్రలో ఇది ఒక రికార్డు అని ఆయన తెలిపారు. అన్నదాతల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలుస్తారు.. అన్నం పెట్టే అన్నదాతకు ఆసరాగా నిలవాలన్నదే కేసీఆర్ తపన.. దేశంలో ఉచిత కరంటు, సాగునీళ్లు, రైతుబంధు, రైతుభీమా పథకాలతో పాటు వంద శాతం పంటలు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలను మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.