Whats app: ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన వాట్సాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Whats app New Features For iOS Users: ఎప్పటికప్పుడు యూజర్లకు కావాల్సిన కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూ ఉంటుంది వాట్సాప్. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు యాప్ ను అప్డేట్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఐఫోన్ యూజర్లకు అదిపోయే ఫీచర్లను అందుబాటులోకి తీసువచ్చింది ఈ ఇన్ స్టాంట్ మెసేజింగ్ యాప్. iOS వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మనకు స్కీన్ షేర్ చేయాల్సిన అవసరం వస్తుంది. గూగుల్ మీట్, జూమ్ కాల్స్ లో ఈ సదుపాయం ఉంటుంది. అయితే తాజాగా వాట్సాప్ ఈ ఫీచర్ ను తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో డైరెక్ట్‌గా యూజర్లు స్క్రీన్‌ను షేర్ చేయవచ్చు. దీనికి సంబంధించి వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడే మనకు స్క్రీన్ షేర్ బటన్ కనిపిస్తోంది. దీనిని క్లిక్ చేసి మనం అవతలివారికి స్ర్కీన్ షేర్ చేయవచ్చు. ఇది ప్రస్తుతానికి కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అన్నీ iOS వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
Also Read: Lancet study: పెరుగుతున్న కీళ్ల వ్యాధి.. 2050 నాటికి 100 కోట్ల మందికి
Also Read
వాట్సాప్ తీసుకువచ్చిన మరో ఫీచర్ వీడియో మెసేజ్ రికార్డింగ్ ఫీచర్. చాటింగ్ చేసేటప్పుడు కేవలం టెక్స్ట్ లేదా వాయిస్ మెసేజ్ ను మాత్రమే ప్రస్తుతం వాట్సాప్ ద్వారా పంపగలుతున్నాం. అయితే ప్రస్తుతం వాట్సాప్ ఐఫోన్ యూజర్ల కోసం వీటికి బదులు మరో ఫీచర్ కూడా అందుబాటులోకి తెచ్చింది. అదే వీడియో మెసేజ్ రికార్డింగ్ ఫీచర్. దీనితో 60 సెకన్ల వరకు వీడియో రికార్డు చేసి నేరుగా సెండ్ చేయవచ్చు. దీనిని జస్ట్ మనం వాయిస్ నోట్ ను ఎలా పంపుతామో అలానే పంపించవచ్చు. అయితే దీనిలో మనం వీడియో రూపంలో పంపిస్తాం. ప్రస్తుతం ఇది iOS 23.16.78 కోసం వాట్సాప్ అప్‌డేట్ స్టోర్‌లో విడుదల చేయబడింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?