Minister Ramanaidu: రైతు సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో మీడియా వేదిక మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. సాగునీటి సంఘాల ఎన్నికలకు అంతా సిద్ధమని, జీవో విడుదలైందని తెలిపారు. నవంబర్ మొదటి వారం నాటికి సాగు నీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు.
Read Also: AP CM Chandrababu: తిరుమల సన్నిధిలో ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలి..
నిర్వీర్యమైన సాగునీటి వ్యవస్థను సాగునీటి సంఘాల ద్వారా రైతుల ప్రాతినిధ్యంతో గాడిలో పెడతామన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో పూడిక, మరమ్మతులు, గేట్లు, గట్ల వంటి వాటికి నిర్వహణ లేదని, పర్యవేక్షణ లేదని ఆయన మండిపడ్డారు. గత వైసీపీ పాలన రైతులకు శాపంగా మారిందన్నారు. నేడు రైతుల ప్రాతినిధ్యంతో ఇరిగేషన్ శాఖ పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ప్రతి చివరి ఎకరం వరకు సాగు నీరు అందేలా సాగు నీటి సంఘాల ప్రాతినిధ్యంతో ఇరిగేషన్ శాఖ ప్రణాళికాబద్దంగా పని చేస్తుందని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు.