Site icon NTV Telugu

Minister Nimmala Ramanaidu: పోలవరంపై సమీక్ష.. డయాఫ్రమ్‌ వాల్‌ పనుల్లో 40 శాతం పురోగతి..!

Nimmala

Nimmala

Minister Nimmala Ramanaidu: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్టుల్లో పోలవరం ఒకటి.. ఆ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఎప్పటికప్పుడూ సీఎం చంద్రబాబు, మరోవైపు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఇక, ఇవాళ, పోలవరం, పోలవరం ఎడమ, ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. సమీక్షలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల ఎస్‌ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు..

Read Also: Supriya Menon: ఏడేళ్ల వేధింపుల పై.. మౌనం వీడిన స్టార్ హీరో పృథ్వీరాజ్ భార్య

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. డయాఫ్రమ్ వాల్ 25,238 చదరపు మీటర్లు పూర్తి చేసి 40 శాతం పురోగతి సాధించాం అన్నారు.. డయాఫ్రమ్ వాల్ 373 ప్యానల్స్ గాను, ఇప్పటికే క్రిటికల్ గా ఉన్న 130 ప్యానల్స్ పూర్తి చేయడం జరిగింది. వరద కాలంలో కూడా డయాఫ్రమ్ వాల్ పనులు ఆగకుండా, డివాటరింగ్ చేసుకుంటూ 2025 డిసెంబర్ కు పూర్తి చేస్తాం అన్నారు.. గ్యాప్-1 ఎర్త్ కమ్ రాక్‌ఫీల్ డ్యామ్ పనులు, 2026 మార్చి నాటికి పూర్తి చేసే లక్ష్యంగా జరుగుతున్నాయి. గ్యాప్-2 ఈసిఆర్ఎఫ్ డ్యామ్ డిజైన్స్ సీడబ్ల్యూసీ మరియు పీపీఏ ఆమోదం పొందిన వెంటనే నవంబర్ కు పనులు మొదలు పెడతాం అని వెల్లడించారు.. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తిచేసి 2025 కల్లా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకు వెళ్లేలా చంద్రబాబు లక్ష్యంకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని.. పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతికి సంబంధించి నేషనల్ హైవే క్రాసింగ్ బ్రిడ్జ్ ల పనులు ఆగస్టులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఇక, గత ఐదు సంవత్సరాల పాలనలో పోలవరం ఎడమ కాలువకు ఒక్క రూపాయి గానీ, ఒక తట్ట మట్టి పనులు గానీ చేయలేదని విమర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు..

Exit mobile version