NTV Telugu Site icon

Minister Ramanaidu: ప్రకాశం బ్యారేజ్ దగ్గర మూడు బోట్లను తొలగించాం..

Nimmalaramanaidu

Nimmalaramanaidu

Minister Ramanaidu: ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా నదిలో ఇప్పటికే మూడు బోట్లను తొలగించామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నీటి అడుగున మరో రెండు బోట్లు ఏమైనా ఉన్నాయేమోనని గాలింపు చేపడుతున్నామన్నారు. బోట్లతో అణు విస్ఫోటనం అంత ప్రమాదాన్ని సృష్టించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నం చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించిన కాలువల పరిశీలనకు వచ్చానన్నారు. రాయలసీమలో హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ టీడీపీ హయాంలో ఏర్పడ్డాయన్నారు. గత ఐదేళ్లలో నీటిపారుదల శాఖకు కేవలం 49 కోట్లు బడ్జెట్ కేటాయించారన్నారు.

Read Also: TTD EO Shyamala Rao: స్వచ్చమైన నెయ్యిని ప్రముఖ సంస్థల ద్వారానే కొనుగోలు చేస్తాం..

టీటీడీలో ఐదేళ్లుగా జరుగిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. లడ్డూ నాణ్యత, భోజనం నాణ్యతపై అనేక కథనాలు వచ్చాయన్నారు.చెప్పేందుకు సిగ్గు పడాల్సిన విధంగా తిరుమల లడ్డు కల్తీ చేశారన్నారు. తిరుమల పట్ల జగన్‌కు ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదన్నారు. శ్రీవారికి వస్త్రాలు సమర్పించేందుకు సతీ సమేతంగా వెళ్ళాలి.. జగన్ ఎప్పుడూ ఒక్కడే వెళ్ళాడన్నారు. స్వామిని దర్శనం చేసుకుంటే రిజిస్టర్ లో సంతకం చేయాలన్నారు. ఎప్పుడు అలా చేయలేదని విమర్శించారు. తిరుమలలో బయట పడుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి వస్తోందన్నారు. లడ్డు వివాదంపై విచారణ జరుగుతుందున్నారు. ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను కాపాడడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఏమి లేదు.. వాస్తవాలు వెలికి తీశామన్నారు.