NTV Telugu Site icon

Minister Narayana: వైజాగ్‌ అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుపై మంత్రి నారాయ‌ణ సమీక్ష..

Minister Narayana

Minister Narayana

Minister Narayana: విశాఖ‌ప‌ట్నం అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయ‌ణ … ఇవాళ ఉదయమే సభలో విశాఖ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావించారు ఎమ్మెల్యేలు పల్లా, వెలగపూడి.. ఆ తర్వాత ఆ ప్రాజెక్టుపై సమీక్ష జరిపారు మంత్రి.. ఈ సమావేశానికి ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. మొద‌టి ఫేజ్ లో పెందుర్తి ఏరియాలో, రెండో ప్యాకేజీలో గాజువాక‌, మ‌ల్కాపురం ప్రాంతంలో యూజీడీ ప‌నులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. మురుగునీటి వ్యవ‌స్థను ఆధునీక‌రించ‌డంతో పాటు రీసైక్లింగ్ వాట‌ర్ ను హెచ్ పీసీఎల్, స్టీల్ ప్లాంట్ కు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.. రూ. 412 కోట్లతో 226 కిలోమీటర్ల మేర మొదటి ప్యాకేజీలో యూజీడీ నిర్మాణ పనులు చేపట్టిన టాటా ప్రాజెక్టులు. సెప్టెంబర్ నెలాఖ‌రుకు మొద‌టి ప్యాకేజీ ప‌నులు పూర్తి చేయాల‌ని కాంట్రాక్టు సంస్థకు మంత్రి నారాయ‌ణ ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ బిల్లులు త్వరితగతిన విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఈ నెల 26వ తేదీన మరోసారి అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.. ఇక, వ‌చ్చే వారం విశాఖ‌లో ప‌ర్యటించి ప‌నులు పరిశీలించనున్నారు మంత్రి నారాయ‌ణ‌.

Read Also: Cyber Crime : సైబర్ మోసం.. కోటి రూపాయలు మాయం..