Minister Narayana: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాకు సంబంధించిన ఏర్పాట్ల అధ్యయనానికి మంత్రి నారాయణ బృందం వెళ్లింది. 2027లో ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం కుంభమేళాలో మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగానే, ఈ సాయంత్రం ప్రయాగ రాజ్ లో కుంభమేళా అధారిటీ ఆఫీసును సందర్శించింది ఈ బృందం.
Read Also: Kishan Reddy : కేసీఆర్, రేవంత్‌కు ఏమాత్రం తేడా లేదు
ఇక, మహా కుంభమేళా ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత చర్యల గురించి మంత్రి నారాయణ బృందానికి కుంభమేళా ఆఫీసర్ విజయ్ కిరణ్ ఆనంద్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కుంభమేళా అధారిటీ కమాండ్ కంట్రోల్ రూమ్ ను మంత్రి, అధికారులు పరిశీలించారు. స్నాన ఘాట్ల దగ్గర ఏర్పాట్లను అక్కడి అధికారులతో కలిసి నారాయణ టీమ్ పరిశీలించింది. 2027లో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు అన్ని కుంభమేళా అధికారులు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు.